పెన్సిల్వేనియా ప్రచార సభలో ట్రంప్ పై ఎలాన్ మస్క్ సెన్సేషనల్ కామెంట్స్..

అమెరికాలో వచ్చే నెల అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది.

Update: 2024-10-06 10:30 GMT

అమెరికాలో వచ్చే నెల అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది. అయితే కథ జులైలో జరిగిన పెన్సిల్వేనియా ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఎక్కడైతే కాల్పులు జరిగాయో అదే ప్రాంతంలో మరొకసారి తన ప్రచార సభ నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతాలో ప్రకటించినప్పుడు ఎలాన్ మస్క్ ఆ పోస్టుకు మద్దతు తెలపడే కాకుండా తాను కూడా వస్తాను అని సమాధానం ఇచ్చారు.

గత జులైలో పెన్సిల్వేనియాలోని బట్లర్లో ట్రంప్ ప్రచార సభ నిర్వహిస్తున్న సమయంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో బుల్లెట్ ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకు వెళ్ళింది. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ట్రంప్ ను కాపాడగలిగారు.

చెప్పినట్లుగానే తాజాగా జరిగిన ప్రచార సభలు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాల్గొన్నారు. సభలో గతంలో కాల్పుల సమయంలో మృతి చెందిన వ్యక్తిని గుర్తు చేసుకుని ట్రంప్ తన సంతాపాన్ని తెలియజేశారు.’మా ఉద్యమాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు..’అని తనపై కాల్పులు జరిపిన నిందితుడిని ఉద్దేశిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన అందరూ ట్రంప్ కు మద్దతుగా టోపీలు ధరించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాన్ మస్క్ తన మద్దతును ట్రంప్ అందిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన ట్రంప్ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో తొలిసారి పాల్గొన్నారు. అంతేకాదు అమెరికాలో ఉన్న ప్రజాస్వామ్యం పరిరక్షింపబడాలి అంటే కచ్చితంగా ఈసారి ట్రంప్ గెలవాలి అని పిలుపునిచ్చారు.

అమెరికాలో వచ్చేనెల జరగబోయే ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని.. ఇందులో ట్రంప్ విజయం సాధించకపోతే డెమోక్రట్లు చట్టవ్యతిరేకమైన చర్యలు అమలు చేస్తారంటూ పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో ఉన్నట్లుగా అమెరికాలో కూడా ఒకే ఒక పార్టీ రాజ్యమేలుతోంది అని మస్క్ విమర్శించారు.

Tags:    

Similar News