తలసరి ఆదాయంలో ఆసక్తికర విషయాలు.. ఏ జిల్లా ఫస్ట్ అంటే..?

ఏపీలో జిల్లాల్లో తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో వృద్ధి కనిపిస్తుంది! అమరావతిలో జరిగిన కలెక్టర్ల తొలిరోజు సదస్సులో జిల్లాల ప్రగతి గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది.;

Update: 2025-03-26 10:51 GMT
తలసరి ఆదాయంలో ఆసక్తికర విషయాలు.. ఏ జిల్లా ఫస్ట్ అంటే..?

ఏపీలో జిల్లాల్లో తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో వృద్ధి కనిపిస్తుంది! అమరావతిలో జరిగిన కలెక్టర్ల తొలిరోజు సదస్సులో జిల్లాల ప్రగతి గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏయే జిల్లాలో తలసరి ఆదాయం ఎలా ఉందనే విషయాలు వెల్లడించింది. ఇందులో ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఆంధ్రప్రదేశ్ లో మూడవ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వచ్చిన మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో తలసరి ఆదాయ వివరాలతో పాటు.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా... తలసరి ఆదాయంలో రూ.1,59,620తో శ్రీకాకుళం జిల్లా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే అభివృద్ధి కనిపిస్తున్నప్పటికీ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చివరి ప్లేస్ లో నిలిచింది. ఇక ఏపీ ఆర్థిక రాజధానిగా చెప్పే విశాఖపట్నం మాత్రం ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఇందులో భాగంగా... 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో విశాఖలో తలసరి ఆదాయాలు వరుసగా... రూ.4,02,798.. రూ.4,86,238.. రూ.5,32,893 గా ఉంది. దీంతో... ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఏపీలో తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లోనూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పోలిస్తే.. అనంతపురం జిల్లా అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటం! వాస్తవానికి అనంతపురం జిల్లాను కరువు పీడిత ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా పరిగణిస్తారు.

మరోపక్క కోనసీమలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే... జిల్లాల తలసరి ఆదాయంలో అనంతపురం జిల్లా ఉద్యోనవన రంగంలో సాధించిన అభివృద్ధి కారణంగా.. వృద్ధి సాధించిందని చెబుతున్నారు. దీంతో... తలసరి ఆదాయంలో ముందున్న జిల్లాల్లోని ఉత్తమ విధానలను, వెనుకబడిన జిల్లాలో కూడా అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News