పాపకు డైపర్లు మార్చటం కంటే టెన్నిస్ ఆడటమే ఈజీనట

టెన్నిస్ మాజీ నెంబర్ వన్ జపాన్ కు చెందిన నవోమి ఒసాక కొత్త సంవత్సరం మొదటి రోజున అదరగొట్టేసింది.

Update: 2024-01-02 04:22 GMT

టెన్నిస్ కోర్టులో చెంగు చెంగున ఉరుకుతూ.. ఎలాంటి షాట్ అయినా ఇట్టే సంధించే టెన్నిస్ క్రీడాకారిణి నోటి నుంచి వచ్చిన ఒక మాట అందరిని తెగ ఆకర్షిస్తోంది. టెన్నిస్ మాజీ నెంబర్ వన్ జపాన్ కు చెందిన నవోమి ఒసాక కొత్త సంవత్సరం మొదటి రోజున అదరగొట్టేసింది.26 ఏళ్ల ఒసాక బిడ్డకు జన్మనివ్వటం ద్వారా తల్లైన ఆమె పదహారు నెలలుగా టెన్నిస్ టోర్నీలకు దూరంగా ఉంటోంది.

నాలుగు గ్రాండ్ స్లామ్ చాంఫియన్ అయిన ఆమె పిల్లల కోసం ఆటకు బ్రేక్ తీసుకుంది. గత ఏడాది జులైలో డెలివరీ అయిన ఆమె.. తర్వాత నుంచి మళ్లీ ప్రాక్టీస్ షురూ చేసింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగు పెట్టిన ఆమె.. టెన్నిస్ రాకెట్ తో తన సత్తా చాటింది. డెలివరీ తర్వాత తాను ఆడిన తొలి మ్యాచ్ లో తాజాగా విజయాన్ని సాధించటం ద్వారా తానేమిటో మరోసారి ఫ్రూవ్ చేశారు. తాజాగా జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీలో తన తొలి మ్యాచ్ ను 6-3, 7-6 (9) వరుస సెట్లలో తమార కోర్పా్‌షపై సింఫుల్ గా గెలిచారు.

మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన తొలి మ్యాచ్ అసాంతం తాను ఎంతో ఒత్తిడికి గురైనట్లుగాపేర్కొన్నారు. టెన్నిస్ ఆడటం.. కుమార్తెను నిద్రపుచ్చటంలో ఏది సులువైనది అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. తన కుమార్తె షాయ్ ను నిద్ర పుచ్చాలంటే తల ప్రాణం తోకకు వస్తోందని.. ఆ మాటకు వస్తే కూతురికి డైపర్లు మార్చటం కంటే టెన్నిస్ ఆడటమే చాలా ఈజీ అని నవ్వుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

Tags:    

Similar News