సెల్ఫ్ గోల్ తర్వాత కూడా పొంగులేటికి ఇంత ధైర్యం ఇచ్చింది రేవంతేనా?
అయితే, బాంబుల మాట అటుంచితే... ఆ స్థాయిలోని భారీ పరిణామాలేవీ చోటు చేసుకోలేదు. దీంతో పొంగులేటి మాటలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి.
తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద కోణంలోనైనా లేదా వివరాలు వెల్లడించడంలో అయినా కావచ్చు, అతి తక్కువగా వినిపించే మంత్రుల పేర్లలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకరు. రాజకీయాల్లో తనదైన శైలి డైనమిజం ఏర్పాటు చేసుకుంటున్న పొంగులేటి ఇటీవల పెద్ద ఎత్తున్నే వార్తల్లో ఉంటున్నారు. ‘దీపావళి ముందు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి’ అని ప్రకటించి సంచలనం రేపారు. అయితే, దీపావళి పండుగ ముగిసినా.. ఎలాంటి పొలిటికల్ బాంబులు పేలకపోవటంతో పొంగులేటి మాటలు డైవర్షన్ పాలిటిక్సే అని టాక్ వచ్చింది. కానీ తాజాగా మళ్లీ పొంగులేటి పాత మాటలనే పునరుద్ఘాటించారు.
సియోల్ పర్యటన సందర్భంగా తనతో ఉన్న జర్నలిస్టులతో పొంగులేటి మాట్లాడుతూ... హైదరాబాద్ చేరుకునే లోగా లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఒకటో, రెండో పొలిటికల్ బాంబులు పేలుతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో 'పొలిటికల్ బాంబ్ ' చర్చనీయాంశంగా మారింది.
అయితే, బాంబుల మాట అటుంచితే... ఆ స్థాయిలోని భారీ పరిణామాలేవీ చోటు చేసుకోలేదు. దీంతో పొంగులేటి మాటలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలాయి. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. బాంబ్ పేలే సమయంలో పేలుతుందని పొంగులేటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత బీఅర్ఎస్ ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని పేర్కొంటూ గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని వివరించారు. తాను చేసిన పొలిటికల్ బాంబ్ కామెంట్లపై పొంగులేటి స్పందిస్తూ బాంబ్ పేలే సమయంలో పేలుతుందని తన మాటను పునరుద్ఘాటించారు.
కాగా, రాజకీయ ప్రకంపనల విషయంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. గత నెల చివరి ఆవరంలో కానీ లేదా దీపావళికి కానీ పేలుతుందన్న పొలిటికల్ బాంబ్ ఆ మేరకు జరక్కపోయినా... మళ్లీ పొంగులేటి ఆ మాటలే పునరుద్ఘాటించడం చూస్తుంటే అయితే ఆయనకు స్పష్టత వచ్చి అయినా ఉండాలి లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఉన్న సమాచారం అయినా కారణం అయి ఉండవచ్చునని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా పొంగులేటి చెప్తున్న పొలిటికల్ బాంబ్ ఎప్పుడు పేలుతుందో మరి.!