పొంగులేటి కీలక రోల్ ప్లే చేశారా ?

ఒక్కమాటలో చెప్పాలంటే బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ లో పొంగులేటి రోల్ చాలా కీలకమని పార్టీ పెద్దలు గుర్తించారు.

Update: 2023-09-20 06:31 GMT

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరకముందు నుండే పొంగులేటి ఆర్ధికంగానే కాకుండా అంగబలంలో కూడా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. ఇలాంటి పొంగులేటికి ఈమధ్యనే తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగసభ నిర్వహణ బాధ్యతలను పార్టీ అప్పగించింది. బహిరంగసభకు జనాలను తీసుకురావటం, తిరిగి తీసుకెళ్ళటం, సభా నిర్వహణ, ముఖ్య అతిథులకు ఏర్పాట్లు వంటి అనేక అంశాలను పొంగులేటి దగ్గరుండి చూసుకున్నారట.

ఒక్కమాటలో చెప్పాలంటే బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ లో పొంగులేటి రోల్ చాలా కీలకమని పార్టీ పెద్దలు గుర్తించారు. అందుకనే పార్టీలో కీలక పాత్ర ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొన్నటి బహిరంగస గ్రాండ్ సక్సెస్ కావటంతో రాష్ట్రవ్యాప్తంగా పొంగులేటి క్రేజు పెరిగిందని పార్టీలోనే చర్చలు మొదలయ్యాయి. పార్టీలో చేరిన కొద్దికాలంలోనే పొంగులేటి బాగా పాపులరైపోయారు. అందుకనే భవిష్యత్తులో జరగబోయే భారీ బహిరంగసభల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను పొంగులేటికే అప్పగించాలని పార్టీ ఆలోచిస్తోంది.

బహిరంగసభల నిర్వహణ పొంగులేటికే ఇవ్వబోతోందని అంటే మాజీ ఎంపీకి చేతి చమురు కూడా బాగా వదిలించుకోక తప్పదని అర్ధమవుతోంది. ఇందుకు పొంగులేటి కూడా మానసికంగా సిద్ధమవ్వాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఇందుకు ప్రతిఫలంగా జిల్లాలో తాను కోరుకుంటున్నట్లు తన మద్దతుదారులకు కొన్ని అసెంబ్లీ టికెట్లను పొంగులేటి ఇప్పించుకునే అవకాశముంది. ఖమ్మం అసెంబ్లీలో పొంగులేటి పోటీచేస్తారని అనుకుంటున్నారు.

ఇది కాకుండా మరో నాలుగు వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లో కూడా తన మద్దతుదారులకే టికెట్లు ఇప్పించుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఖమ్మంతో కలుపుకుని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లు పొంగులేటి ఖాతాలోనే పడబోతున్నాయంటే మామూలు విషయంకాదు.

కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప సీనియర్ నతయినా వేరే నియోజకవర్గంలో తన మద్దతుదారుడికి టికెట్ ఇప్పించుకోవటం అంటే ఎంతకష్టమో తెలిసిందే. అలాంటిది ఏకంగా నాలుగు టికెట్లను కేటాయించుకోవటం అంటే పార్టీ పెద్దలు పొంగులేటికి ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్ధమవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News