నాడు చెప్పులేసి ఇప్పుడు దండలు... సిగ్గు సిగ్గంటున్న పోసాని!

ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయనపై చెప్పులు వేయించిన వ్యక్తి అని.. అలా ఎన్టీఆర్ ను చంపేసి ఇప్పుడు దండలు వేస్తున్నారని ఫైరయ్యారు.

Update: 2023-08-29 12:13 GMT

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పేరు మీద రూ.100 ణానాన్ని విడుదల చేసిన కార్యక్రమం సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా జరిగిన ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి అసలైన లక్ష్మీపార్వతిని పిలవకుండా కొసరైన వాళ్లకు ముందు వరుసలో సీట్లు వేశారంటూ కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం... లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

ఈ సమయంలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి చంపిన వ్యక్తి చంద్రబాబు అని.. ఆయనపై చెప్పులు వేయించిన వ్యక్తి అని.. అలా ఎన్టీఆర్ ను చంపేసి ఇప్పుడు దండలు వేస్తున్నారని ఫైరయ్యారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన పోసాని కృష్ణమురళి... ఎన్టీఆర్‌ ముఖం మీద చంద్రబాబు చెప్పులు వేయించాడు.. ఎన్టీఆర్‌ ను చంపేసి ఇప్పుడు దండలు వేస్తున్నాడు.. ఇది అత్యంత సిగ్గుచేటు.. అని పోసాని ఫైరయ్యారు. ఇదే సమయంలో పురందేశ్వరి టాపిక్ కూడా ఎత్తారు!

ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిన చంద్రబాబును.. పురంధేశ్వరి ఎందుకు నిలదీయలేదు అని ప్రశ్నించిన ఆయన... ఎన్టీఆర్‌ గొప్ప నటుడు ఆయన్ని అవమానించిన వెన్నుపోటుదారుడు చంద్రబాబు.. వంగవీటి రంగాను చంపింది కూడా చంద్రబాబే.. అని పోసాని తెలిపారు!

ఈ క్రమంలో చంద్రబాబు నాయుడికి ఉన్న అన్ని అలవాట్లూ నారా లోకేష్ కి వచ్చాయని చెప్పిన పోసాని... లోకేశ్‌ అంత నీచంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పథకాలిస్తుంటే చంద్రబాబు, లోకేశ్‌ బూతులు తిడుతున్నారని అన్నారు.

ఇదే సమయంలో పుంగనూరు ఘటనను ప్రస్థావించిన ఎపీ ఎఫ్.డి.సి. ఛైర్మన్... పోలీసులను రౌడీలతో కొట్టించిన నీచుడు చంద్రబాబు అని తీవ్రస్థాయిలో దుబ్బయట్టారు. ఒకపక్క పోలీసులను కొట్టించి.. మరోపక్క సిగ్గులేకుండా పోలీసు సెక్యూరిటీతో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా... చంద్రబాబు కోసం, ఆయన రాజకీయాలకోసం రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అడ్డమైన పనులు చేస్తున్నారని ఫైరయ్యారు. ఏది ఏమైనా... గతకొన్ని రోజులుగా టీడీపీ నేతలపై.. మరి ముఖ్యంగా తన చావుకు కారణం అంటూ ప్రకటించిన లోకేష్ పై పోసాని వితౌట్ గ్యాప్ ఫైరవుతూనే ఉన్నారు!

Tags:    

Similar News