న్యూ ఇయర్‌ వేడుక ఇన్విటేషన్‌లో కండోమ్‌, ఓఆర్‌ఎస్‌

పూణెలోని ఒక పబ్‌ డిసెంబర్‌ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.

Update: 2024-12-31 07:12 GMT

ప్రపంచవ్యాప్తంగా జనాలు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధం అయ్యారు. 2024కు గుడ్‌ బై చెప్పి 2025ను గ్రాండ్‌గా ఆహ్వానించాలనే ఉద్దేశ్యంతో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు ఏడాదికి ఏడాది కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చోట కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నారు. జనాల్లో ఉన్న ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు కొన్ని సంస్థలు భారీ ఎత్తున ఈవెంట్స్‌ను ప్లాన్‌ చేస్తున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా సెలబ్రెటీలతో డాన్స్‌లు చేయించడం మొదలుకుని రకరకాల వింధు వినోదాలను అందించడంకు చాలా ఈవెంట్‌ సంస్థలు ఏర్పాట్లు చేశాయి.

పూణెలోని ఒక పబ్‌ డిసెంబర్‌ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. తమ రెగ్యులర్‌ కస్టమర్‌లతో పాటు ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేకంగా ఆహ్వానాలను అందించింది. ఆహ్వాన పత్రికలో కండోమ్‌ ప్యాకెట్‌తో పాటు ఓఆర్‌ఎస్‌ అందించడం జరిగింది. న్యూ ఇయర్‌ ఆహ్వాన పత్రికలో ఇవి ఎందుకు అంటూ చాలా మంది మాట్లాడుకోవడంతో పాటు, కొందరు పబ్‌ నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటివి పంపించి యువతకు ఏం నేర్పించాలి అనుకుంటున్నారు, యువతను తప్పుదోవ పట్టించేందుకు మీరు చేస్తున్న ఇలాంటి పనులు ఏ మాత్రం హర్షనీయం కాదు అంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఈ వివాదం చిన్నగా మొదలై చాలా పెద్దగా మారింది. దాంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పబ్‌ యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై స్పందించలేదు. తమకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తుంది అంటూ కొందరు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం కి తెలియకుండా కింది స్థాయి వారు చేసిన తప్పు అది అని కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది పోలీసులు తమ విచారణలో తేల్చాల్సి ఉంది. పుణే తో పాటు దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకల పేరుతో అత్యంత జుగుప్సాకరమైన పనులు చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ న్యూ ఇయర్‌ వేడుకలు జరుగుతాయి. అయితే ఇండియాలో జరిగే న్యూ ఇయర్ వేడుకలు అత్యంత ఖరీదైనవిగా చెబుతూ ఉంటారు. వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క రాత్రి ఎంజాయ్‌ చేయడం కోసం నగర శివారు ప్రాంతాలకు జనాలు వెళ్తారు. అక్కడ అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతారు అనే టాక్‌ ఉంది. న్యూ ఇయర్‌ నైట్‌ కావడంతో పోలీసులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు. ఆ ఒక్క రాత్రి ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతాయని అంటారు. కనుక ప్రతి ఒక్కరూ సెఫ్టీగా ఉండి న్యూఇయర్‌ను జరుపుకోవాలని పలువురు పిలుపునిస్తున్నారు. హ్యాపీ అండ్ సేఫ్టీ న్యూ ఇయర్‌.

Tags:    

Similar News