పవన్ తో రఘురామ భేటీ... తెరపైకి కీలక వ్యాఖ్యలు!
ఈ క్రమంలో తాజాగా ఉగాది నాడు చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా పోటీచేస్తున్న నేపథ్యంలో... ఇటీవల రఘురామకృష్ణంరాజు టీడీపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే! ఆయన కూటమిలో భాగంగా తొలుత నరసాపురం ఎంపీ టిక్కెట్ ఆశించినప్పటికీ.. అది దక్కలేదు! దీంతో... తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో, ఎంపీగా పోటీ చేస్తానో ఇంకా తేలలేదని.. మరో రెండు రోజులు ఆగాలని కోరుతున్నారు టీడీపీ నేత రఘురామ కృష్ణంరాజు.
ఈ క్రమంలో తాజాగా ఉగాది నాడు చేబ్రోలులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు. అయితే.. చాలా సేపు నడిచిన ఈ భేటీలో ఏమి మాట్లాడుకున్నారనే విషయాన్ని మాత్రం చెప్పలేనని చెప్పిన రఘురామ... రాష్ట్రంలో జగన్ పాలన పోవడానికి టీడీపీ - బీజేపీ - జనసేన కలిసి కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారకుడైన గొప్ప వ్యక్తి పవన్ కల్యాణ్ అని కొనియాడారు.
ఈ సమయంలో అలాంటి నాయకుడిని పవిత్రమైన ఉగాది రోజు కలిసి.. జనసేన సహకారంతో రానున్న రోజుల్లో రాష్ట్రానికి పట్టిన సమస్యను వదిలించుకోవాలని తెలిపారు! ఈ సమయంలో చంద్రబాబు - పవన్ ల సారధ్యం రాష్ట్రానికి ఎంతో అవసరం అని, ఈ నేపథ్యంలో వీలైనన్ని ఎక్కువ మీటింగులు ఏర్పాటు చేయాలని కోరారు!
ఇదే క్రమంలో... తాను అసెంబ్లీకి పోటీ చేస్తానా, పార్లమెంటుకు పోటీ చేస్తానా అనే విషయంపై అస్పష్టత ఉన్నప్పటికీ.. తాను ఎక్కడ పోటీ చేసినా పవన్ కల్యాణ్ వచ్చి క్యాంపెనింగ్ చేయాలంటూ ఆయన సహకారాన్ని కోరడం జరిగిందని రఘురామ తెలిపారు. తనకు ఇప్పుడే కాదని.. ఎప్పటినుంచో పవన్ తో పాటు చిరంజీవితోనూ మంచి అనుబంధం ఉందని ఈ సందర్భంగా రఘురామ తెలిపారు.
ఇదే సమయంలో పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన రఘురామ... జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో జనసేనానికి 65వేల ఓట్ల మెజార్టీ ఖాయమని తెలిపారు!