రాహుల్ అపొజిషన్ అక్కడ....మోడీకి కష్టమేనా ?
రాహుల్ గాంధీ కేబినెట్ ర్యాంక్ హోదాలో ఈసారి అపోజిషన్ లీడర్ అయ్యారు.
రాహుల్ గాంధీ కేబినెట్ ర్యాంక్ హోదాలో ఈసారి అపోజిషన్ లీడర్ అయ్యారు. ఆయన పార్టీకి తాజా ఎన్నికల్లో 99 మంది ఎంపీ సీట్లు వచ్చాయి. ఇండియా కూటమి పార్టీలకు 232 సీట్లు వచ్చాయి. కొత్త పార్లమెంట్ లో ఎన్డీయేకు సరిసమానంగా ఇండియా కూటమి మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు.
మోడీ ఎంపీగా ప్రమాణం చేసినపుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ ని ఆయనకు చూపించారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని ప్రమాణం చేస్తూంటే నిట్ పరీక్ష గురించి నినాదాలు చేశారు. మొత్తానికి ఎంపీల ప్రమాణం నుంచే కొత్త సభ తీరు తెన్నులు ఎలా ఉంటాయో చెప్పేశారు అంతా.
మోడీ అయితే తన ఎదురుగా అపొజిషన్ లో ఉన్న రాహుల్ గాంధీని చూస్తూనే ప్రమాణం చేశారు. ఇక ఈసారి ఎన్డీయే ప్రభుత్వానికి బలం పూర్తిగా లేదు. బీజేపీకి సొంత మెజారిటీ లేదు. దాంతో తమ నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోలేదు అని ఇండియా కూటమి పెద్దలు అంటున్నారు. చంద్రబాబు నితీష్ కుమార్ ల మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది.
చంద్రబాబు వరకూ ఓకే కానీ నితీష్ డౌట్ అని అంటున్నారు. దీంతో ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం స్థిరత్వం అంటే ఇండియా కూటమి అయితే సెటైర్లు వేస్తోంది. మోడీ ఎంతసేపూ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోనే బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
మోడీ ప్రధాని అయ్యాక దేశంలో అనేక అంశాల మీద ప్రశ్నించినా ఆయన మౌనంగానే ఉంటున్నారు అని రాహుల్ విమర్శించారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేనురోజులలో చాలా సంఘటలను జరిగాయని అందులో పేర్కొన్నారు. వాటిలో 1 పశ్చిమబెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం. 2. కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులు. 3. రైళ్లలో ప్రయాణీకుల దుస్థితి. 4. నీట్ స్కామ్. 5. నీట్ పిజి రద్దు, 6. యుజిసి నీట్ పేపర్ లీక్. 7. పెరిగిన పాలు, పప్పులు, గ్యాస్, టోల్ ఛార్జీలు. 8. కాలిపోతున్న అడవులు. 9. నీటి సంక్షోభం. 10. సరైన ఏర్పాట్లు లేక వడదెబ్బ వల్ల సంభవించిన మరణాలు అని రాహుల్ పోస్టులో పేర్కొన్నారు.
ఇంతలా సమస్యలు ఉన్నా ఈ కీలకమైన విషయాల్లో ప్రధాని మాట్లాడకుండా ఎందుకు ఉన్నారని ఆయన నిలదీశారు. మోడీ ఎంతసేపూ తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే బిజీగా ఉన్నారు తప్ప దేశ సమస్యలు పట్టవా అని రాహుల్ ప్రశ్నించారు. గతంలో ఏమో కానీ ఇపుడు ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఇండియా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇండియా కూటమి నిరంతరం ప్రజా సమస్యల్ని లేవనెత్తుతూనే ఉంటుందని, ప్రధాని మోడీ వాటి నుంచి తన జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరని రాహుల్ గాంధీ తన పోస్టులో పేర్కొన్నారు.
మొత్తానికి రాహుల్ గాంధీ ఎన్నడూ లేని నిబ్బరంతో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను ఆయన తొలిసారి తీసుకుంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఈ పదవే ఆయనకు తొలి కేబినెట్ ర్యాంక్ పదవి అవుతుంది. ఈ రోజు ప్రధాన ప్రాతిపక్ష నేత అంటే రేపటి ప్రధాన మంత్రి అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాహుల్ ని వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటున్నారు.