మిత్రపక్షాలకు బూటకపు వాగ్దానాలు...రాహుల్ చెప్పింది నిజమేనా ?

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఆయన హాట్ కామెంట్స్ చేసారు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్ అని కూడా అన్నారు

Update: 2024-07-23 12:04 GMT

ఏపీకి బీహార్ కి బడ్జెట్ లో పెద్ద పీట వేశారని అంతా సంబరపడుతున్నారు. కానీ బడ్జెట్ చూస్తే ఏమీ లేదు డొల్లతనం తప్ప అని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో బడ్జెట్ ని ఏర్చి కూర్చారని అన్నారు. ఈ క్రమంలో మిత్ర పక్షాలను బూటకపు వాగ్దానాలతో సంతృప్తి పరచారని రాహుల్ విరుచుకుపడ్డారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ఆయన హాట్ కామెంట్స్ చేసారు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్ అని కూడా అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫేస్టోనీ అలాగే గత బడ్జెట్ లను కాపీ పేస్ట్ చేశారు తప్ప కొత్తదనం ఏముందని ప్రశ్నించారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల వారిని పూర్తిగా పక్కన పెట్టి మిత్రులను సంతృప్తి పరచారు అని ఆయన విమర్శించారు. ఈ బడ్జెట్ ద్వారా మిత్రులను మాత్రమే ఆనందింపచేసారు అని అన్నారు. ఆ మిత్రులు అంబానీ అదానీ అనే అర్ధం వచ్చేలా ఏఏలని సంకేతాలు ఇచ్చారు. వారిని సంతృప్తి పరచేందుకు బడ్జెట్ లో చేసిన ప్రయత్నంలో సామాన్యులకు న్యాయం జరగలేదని అన్నారు.

ఈ బడ్జెట్ లో ఒక గొప్ప విషయం ఏమిటి అంటే దేశంలో నిరుద్యోగం ఉందని అంగీకరించడం అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కొత్త బడ్జెట్ మీద విమర్శలు చేసింది. నిరుద్యోగం దేశంలో ఉందని అది జాతీయ సంక్షోభంగా మారిందని ఈ బడ్జెట్ వల్ల ఇండైరెక్ట్ గా అయినా కేంద్రం అంగీకరించిందని కాంగ్రెస్ సెటైర్లు పేల్చింది. ఈ బడ్జెట్ ని చూస్తే కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అర్ధం అవుతోందని కూడా కాంగ్రెస్ పేర్కొనడం విశేషం.

రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ బడ్జెట్ బాగాలేదని అంటూనే ఇది మభ్యపెట్టిన బడ్జెట్ అంటున్నారు. బూటకపు హామీలు మిత్ర పక్షాలకు కేంద్రం ఇచ్చింది అని రాహుల్ చేసిన విమర్శ సైతం ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ లో హామీలు మాత్రమే దక్కాయని అంటున్నారు. వాటి ఆచరణ అమలు మీదనే కేంద్రం చిత్తశుద్ధి ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

అంటే బడ్జెట్ లో కనిపించే కేటాయింపులు అమలుకు వచ్చేసరికి ఎన్ని మలుపులు ఉంటాయో అన్న డౌట్లనే రాహుల్ వ్యక్తం చేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ బడ్జెట్ లో రాజకీయ ఒత్తిడులు అని కాంగ్రెస్ అనడం ద్వారా టీడీపీ జేడీయూల కోసం కొన్ని కేటాయింపులు చేసినట్లుగా చూపించింది అని అంటున్నారు. మొత్తనికి బడ్జెట్ లో అంకెలు బాగున్నాయి. హామీలు కూడా బాగున్నాయి. అవి అమలుకు నోచుకున్నపుడు కదా అన్నదే కాంగ్రెస్ చెబుతున్న అర్ధం పరమార్ధం అని భావించాలేమో.

Tags:    

Similar News