రాజస్థాన్ థార్ ఎడారిలో రాజకుమారి స్కూల్... ప్రత్యేకతలివే
రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారి నడిబొడ్డున ఈ పాఠశాల ఉంది. ఈ పాఠశాల అద్భుతాన్ని నిర్మాణాన్ని న్యూయార్క్ కు చెందిన డయానా కెల్లాగ్ అనే ఆర్కిటెక్ట్ ఇసుకరాయిని ఉపయోగించి రూపొందించింది.
సాధారణంగా 30 డిగ్రీల టెంపరేచర్ దాటితే పిల్లలు చాలా ఇబ్బందులు పడిపోతారు.. ఉక్కబోతకు అలసిపోతుంటారు. ఇక వేసవిలో 35 డిగ్రీలు దాటితే స్కూళ్లకు సెలవులే. ఈ క్రమంలో కాస్త ఎక్కువ ఫీజులు వసూలు చేసే కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు ఇప్పుడు ఏసీ తరగతి గదుల్లో పాఠాలు చెబుతున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... మినిమం 50 డిగ్రీల టెంపరేచర్ ఉండే థార్ ఎడారిలో స్కూల్ ఉన్న సంగతి తెలుసా?
అవును... రాజస్థాన్ థార్ ఎడారిలో ప్రత్యేకంగా బాలికల కోసం కిండర్ గార్టెన్ నుండి 10వ తరగతి వరకూ చదువుకునే అవకాశం ఉన్న పాఠశాల ఒకటి ఉంది! ఈ పాఠశాలలో అన్నీ ప్రత్యేకతలే ఉండటం గమనార్హం. బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలకు, అత్యల్ప మహిళా అక్షరాస్యత ఉన్న వర్గాలకూ విద్యను అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది!
అదే... రాజస్థాన్ లోని "రాజకుమారి రత్నావతి బాలికల పాఠశాల"! ఈ పాఠశాలలో కిండర్ గార్టెన్ నుండి 10వ తరగతి వరకూ సుమారు 400 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఎడారి మధ్యలో నిర్వహిస్తున్న ఈ పాఠశాల నిరంఆణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సుమారు 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే ఉష్ణోగ్రతలు, ఇసుక తుఫానులు, హీట్ వేవ్ ల వంటి వివిధ సవాళ్లను ఎదుర్కొనేలా ఈ స్కూల్ డిజైన్ చేయబడింది. ఈ భవనంలోపల లైం ప్లాస్టర్, ఇసుక రాయిని ఉపయోగించడం వల్ల ఈ గదులు పగలంతా చల్లగా, రాత్రులు వెచ్చగా ఉంటాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని థార్ ఎడారి నడిబొడ్డున ఈ పాఠశాల ఉంది. ఈ పాఠశాల అద్భుతాన్ని నిర్మాణాన్ని న్యూయార్క్ కు చెందిన డయానా కెల్లాగ్ అనే ఆర్కిటెక్ట్ ఇసుకరాయిని ఉపయోగించి రూపొందించింది. ఈ పాఠశాల జైసల్మేర్ గ్రామీణ ప్రాంతంలో కనోయి గ్రామానికి సమీపంలో ఉంది. ఈ పాఠశాలకు ఈ పాఠశాలకు మహారావల్ రతన్ సింగ్ కుమార్తె, జైసల్మేర్ యువరాణి "రత్నవతి" పేరు పెట్టారు.
ఇక ఈ నిర్మాణంలోని మరిన్ని ప్రత్యేకతలను పరిశీలిస్తే... ఇందులో రాజస్థాన్ లోని ప్రసిద్ధ కోటలను గుర్తుచేసే అద్భుతమైన వంపు గోడలను కలిగి ఉంతుంది. ఓవల్ ఆకారంలో ఉన్న ఈ భవనంలో పెద్ద సెంట్రల్ ప్రాంగణం ఉంది. ఇందులో కొత్తగా పూర్తి చేయబడిన నిర్మాణం "జ్ఞాన్ సెంటర్", ఇందులో మేధా అని పిలువబడే ఒక ప్రదర్శన స్థలం, మహిళల సహకార భవనం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానిక కళాకారులు మహిళలకు సాంప్రదాయ చేతిపనుల పద్ధతులను బోధిస్తారు.
ఈ పాఠశాల స్థానిక కళాకారులతో నిర్మించబడింది. వారిలో చాలా మంది ఈ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిల తండ్రులు ఉన్నారు! ఈ ప్రాంతం నుండి సేకరించిన చేతితో చెక్కిన జైసల్మేర్ ఇసుకరాయితో నిర్మాణం జరగగా.. పాఠశాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు స్థానిక కార్మికులచే స్టోన్ కట్ ఆర్ట్ పనిని చేపట్టింది. ఈ కాంప్లెక్స్ లోని ప్రాంగణంలో సుమారు 3.5 లక్షల లీటర్ల నీటిని సేకరించి నిల్వ చేయవచ్చు.
ఈ పాఠశాల కోసం జైసల్మేర్ రాజ కుటుంబం, మన్వేంద్ర సింగ్ షెకావత్ భూమిని విరాళంగా ఇచ్చారు. ఇక సీఐటీటీఏ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపకుడు మైఖేల్ డౌబ్ ఈ భవనాన్ని నిర్మించడానికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. స్థానిక గ్రామీణ ప్రాంతాల్లోని బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల మైలురాయిగా నిలుస్తుందని చెబుతున్నారు.