అమరావతికి 'ఈనాడు' పది కోట్ల విరాళం!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఈనాడు గ్రూపు సంస్థలు రూ.10 కోట్ల విరాళం ప్రకటించాయి
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఈనాడు గ్రూపు సంస్థలు రూ.10 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మేరకు ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు కుమారుడు ఈనాడు ఎండీ కిరణ్ దీనికి సంబంధిం చిన చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. అమరావతి అభివృద్ధి కావాలని.. అమరావతి ద్వారా రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించాలని.. తన తండ్రి రామోజీరావు భావించినట్టు తెలిపారు. తాజాగా విజయవాడ శివారు.. కానూరులో నిర్వహించిన రామోజీ సంస్మరణ సభలో కిరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామోజీ తనయుడు కిరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయాలను, విలువలను కాపాడుతా నన్నారు. తమ కుటుంబం మొత్తం.. రామోజీ విలువలకు కట్టుబడి ఉంటుందన్నారు. పత్రికా రంగంలో రామోజీరావు తనదైన ముద్ర వేశారని.. ప్రజల హక్కులు హరణకు గురైనప్పుడల్లా.. రామోజీరావు.. పదునైన అక్షరాలతో వారికి అండగా నిలిచారని చెప్పారు. తాము కూడా.. అదే బాటలో పయనిస్తామని.. రామోజీ ఆశయాల మేరకు.. ప్రజల పక్షంగా నిలుస్తామని తెలిపారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి తమ వంతుగా రూ.10 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్టు కిరణ్ చెప్పారు. ఈ మేరకు ఆయన సభలోనే సీఎం చంద్రబాబుకు ఈ సొమ్ముకు సంబంధించిన చెక్కును అందించారు. రాష్ట్రంలోనూ..దేశంలోనూ.. రామోజీరావుకు నివాళులర్పిస్తున్న విషయం.. తెలిసి తాము గర్వపడుతున్నా మన్నారు. మహోన్నత కీర్తి శిఖరం తాలూకు అన్ని విలువలను భావితరానికి అందించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. రామోజీ సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కిరణ్ ధన్యవాదాలు తెలిపారు.