రేవంత్ రెడ్డి సీఎం అయితే కేసీయార్ కి భారీ షాక్ రెడీ...?

రేవంత్ రెడ్డి పేరు ఇపుడు తెలుగు రాజకీయాల్లో బాగా నానుతోంది. ప్రత్యేకించి తెలంగాణా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పాపులర్ లీడర్ గా ఉన్నారు.

Update: 2023-12-02 12:28 GMT

రేవంత్ రెడ్డి పేరు ఇపుడు తెలుగు రాజకీయాల్లో బాగా నానుతోంది. ప్రత్యేకించి తెలంగాణా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పాపులర్ లీడర్ గా ఉన్నారు. పీసీసీ చీఫ్ గా అయన ఉన్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కాలికి బలపం కట్టుకుని ఊరూరా తిరిగారు. కష్టం ఊరకే పోదు అన్నట్లుగానే కాంగ్రెస్ విజయానికి దారులు అన్నీ తెరచుకుంటున్నాయి.

అదే టైం లో రేవంత్ రెడ్డికి సీఎం చాన్స్ కూడా ఉందని అత్యధిక శాతం విశ్వసిస్తున్నారు. ఇంతటి భారీ విజయం సాధించిన తరువాత ప్రజల్లో పేరున్న నేతలు పట్టం కట్టకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కూడా అంటున్నారు. దాంతో రేవంత్ రెడ్డికి ఎక్కువగానే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపధ్యంలో డిసెంబర్ తొమ్మిదిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని కూడా అంతా అంటున్నారు. రేవంత్ రెడ్డి అయితే ఇంకాస్తా ముందుకు వెళ్ళి అదే రోజునే మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ రెండింటినీ కలిపే చాలా మంది చదువుకుంటునారు. డైజెస్ట్ కాని వారు దానిని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

సరే రేవంత్ రెడ్డి తెలంగాణా సీఎం అయితే ఏమి జరగబోతోంది అన్నది ఇపుడు చర్చకు వస్తున్న మరో వేడి వేడి అంశంగా ఉంది.ఇక పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి తెలంగాణా మొత్తం మీద చేసిన విస్తృత ప్రచారంలో కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. కేసీయార్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని కూడా ఆయన అన్నారు.

ఇక దీని మీద ఇండియా టుడే తో జరిగిన ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్నను రేవంత్ రెడ్డికి వేశారు. కేసీయార్ మీద చట్టపరమైన చర్యల గురించి ఇండియా టుడే అడిగినప్పుడు, రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించారు. కేసీఆర్ కుటుంబంలో జరిగిన భారీ అవినీతిపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్‌ హయాంలో సిట్టింగ్‌ జడ్జితో పాటు అలాగే ప్రత్యేక కమిటీతో కూడిన ప్యానెల్‌ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారని అంటున్నారు.

కాంగ్రెస్ భారీ విజయం మీద యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా సరిగ్గానే వేస్తున్నాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలుపు సునాయాసమే అని ఆయన అన్నారు. ఇక కేసీయార్ మీద కూడా చట్టపరమైన చర్యలు అని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే తెలంగాణ రాజకీయాలు మొదటి నుంచి వేడెక్కనున్నాయని అంటున్నారు.

కేవలం ఇండియా టుడెకు మాత్రమే రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పలేదు. ఒక ప్రముఖ టీవీ చానల్ కి కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా రేవంత్ రెడ్డి ఇదే మాట అన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవని, కానీ కేసీయార్ ప్రభుత్వం అవినీతి మీద చట్టప్రకారం అయితే కచ్చితంగా చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. అంటే తెలంగాణాలో రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే కేసీయార్ కి భారీ షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని అర్ధమవుతోంది. మరి ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News