ట్రెండింగ్ టాపిక్: ఆర్జీవీ - లోకేష్... మధ్యలో వ్యూహం!

దీంతో... తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ఇందులో భాగంగా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు.

Update: 2023-11-03 15:09 GMT

రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న "వ్యూహం" చిత్రం సృష్టిస్తున్న అలజడిగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ రాజకీయాలు ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ లు ఈ సినిమాలో ఏమి ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాయి. దీంతో ఈ సినిమాపై ఆసక్తి రోజు రోజుకీ పెరిగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే టీడీపీ నుంచి అభ్యంతరలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే "వ్యూహం" చిత్రాన్ని నవంబర్‌ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు. ఇందులో భాగంగా సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. ఆయన రాసిన ఆరు పేజీల లేఖలో పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

అవును... సెన్సార్‌ బోర్డ్‌ కు రాసిన లేఖలో... సీఎం జగన్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ తో ముగియనుందని, ఈ నేపథ్యంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో రాంగోపాల్ వర్మ ఆయనపై "వ్యూహం" చిత్రాన్ని తీస్తున్నారని లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబుతో పాటు తనను కించపరిచేలా సన్నివేశాలు ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ఉన్నాయని, ఇవి పరువు నష్టం దావా కిందకు వస్తాయని లోకేష్‌ లేఖలో పేర్కొన్నారు!

ఇదే క్రమంలో... సినిమా ట్రైలర్‌ విడుదలైన సమయంలో తాను ఢిల్లీలో, తన తండ్రి జైల్లో ఉన్న కారణంగానే "ట్రైలర్‌" లో సదరు సన్నివేశాలు ఉన్నట్లు తమకు తెలియలేదని లోకేష్‌ లేఖలో ప్రస్తావించడం గమనార్హం. అదేవిధంగా... స్కిల్ కేసు విషయాన్ని కూడా ఈ సినిమాలో ప్రస్తావించారని, ఇది విచారణపై ప్రభావం చూపుతుందని, కాబట్టి సెన్సార్‌ బోర్డ్ నిబంధనల ప్రకారం ఈ చిత్రానికి అనుమతి నిరాకరించాలని లోకేష్‌ కోరారు.

ఆ వ్యవహారం ఒకెత్తు అయితే... ఇటీవల మీడియాతో మాట్లాడిన లోకేష్, ఆర్జీవీని ఉద్దేశించి పలు కామెంట్లు చేశారు. అందులో భాగంగా.. "రాంగోపాల్ వ‌ర్మ స‌మాజానికి ఏం చేశాడు? ఏపీ రాష్ట్రాభివృద్ధికి ఏం చేశాడు? చంద్రబాబు గారు ఏపీ అభివృద్ధికి పాటుప‌డ్డారు, ల‌క్షలాది మందికి ఉద్యోగాలు క‌ల్పించారు" అంటూ ఎదురుగా ఉన్న విలేఖరులపై ఫైరయినంత పనిచేశారు!

ఇక నాటి నుంచి లోకేష్ ను ఆర్జీవీ మరింత వెంటాడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... "నిన్ను చూసి జాలిపడాలా, నవ్వాలా, ఏమీ చేయాలో అర్ధం కావడం లేదు" అని మొదలుపెట్టిన ఆర్జీవీ... తాను ఒక ఫిల్మ్ మేకర్ అని, సినిమాలు తీయడం తన పని అని, తానేమీ జనాలను ఉద్దరించడానే పుట్టానని ఇప్పటివరకూ ఎప్పుడైనా ప్రశ్నించానా అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనను విమర్శించడానికి సమాజ సేవ కాకుండా బోలెడన్ని విమర్శలు ఉన్నాయని, అవి కూడా తానే చెప్పాల్సి రావడం దారుణం అని అన్నారు.

మరో ట్వీట్ లో "అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు... ఎన్ని వ్యూహాలు పన్నినా మా " వ్యూహం" నీ ఆపలేరు" అని సెన్సార్ బోర్డుకి లోకేష్ లేఖ అనంతరం కంటిన్యూ చేశారు ఆర్జీవీ! ఇదే సమయంలో... "నేను నా వ్యూహంతో నీ కెరీర్ ను కెలకడానికి రాలేదు.. నా వ్యూహంతో నీ వ్యూహాన్ని బయటపెట్టడానికి వచ్చినా.. తగ్గేదేలే" అంటూ పుష్ప సినిమాలో సీన్ ని వాడేశారు ఆర్జీవీ!

మరోపక్క వైసీపీ యూకే సమన్వయకర్త.. లోకేష్ సెన్సార్ బోర్డ్ కి చేసిన ఫిర్యాదు పై స్పందిస్తూ... "కట్ డ్రాయర్లతో ఊరేగిస్తా, ఉచ్చ పోయిస్తా అని ఒక సినిమా దెబ్బకి సుసు పోసుకుంటున్న ఢిల్లీ పిల్లి లోకేష్" అని చేసిన కామెంట్ పైనా ఆర్జీవీ స్పందించారు. దీంతో వ్యూహం సినిమా విడుదల విషయంలో లోకేష్ - ఆర్జీవీ మధ్య ఈ వార్ మరిన్ని ఎపీసోడ్ లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది!

కాగా.. గతకొన్ని రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ని "బేబీ" అంటూ ఆర్జీవీ సంభోస్తున్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News