సౌదీలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది ఇండియన్స్ మృతి!

అవును... సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మరణించారు.

Update: 2025-01-29 11:43 GMT

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్ర విషాదం నింపింది. ఇందులో భాగంగా... సౌదీ పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ఇండియన్స్ ప్రాణాలు కోల్పోయినట్లు జెడ్డాలోని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

అవును... సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మరణించారు. దీనిపై జెడ్డాలోని ఇండియన్స్ కాన్సులేట్ స్పందించింది.. సంతాపం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎక్స్ వేదికగా విడుదల చేసింది. అయితే... మృతులు భారత్ లోని ఏయే రాష్ట్రాలకు చెందినవారనేది ఇంకా వెళ్లడించలేదు.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఇండియన్ కాన్సులేట్... సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించడంపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని.. బాధిత కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించింది.

ఇదే సమయంలో... జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ పూర్తి సహకారం అందిస్తోందని.. భాదిత కుటుంబాలతో భారత్ లోని అధికారులు టచ్ లో ఉన్నారని తెలిపింది. అదేవిధంగా... ఈ ఘటనలో గాయపడినవారు త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కోంది. ఈ సందర్భంగా హెల్ప్ లైన్ నెంబర్స్ కి ప్రకటించింది.

ఇందులో భాగంగా... ఈ మేరకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు 8002440003 (టోల్ ఫ్రీ), 0122614093, 0126614276, 0556122301 (వాట్సప్) ఏర్పాటు చేశామని పేర్కొంది.

ఇదే సమయంలో.. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతోన్న జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News