విమాన ప్రయాణాలు చేసే హైదరాబాదీలకు బోలెడన్ని శుభవార్తలు

ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి హాంకాంగ్ కు వెళ్లాలంటే సింగపూర్.. కౌలాలంపూర్ మీదుగా బ్యాంకాక్ కు చేరుకోవాల్సి ఉండేది. అందుకు భిన్నంగా వచ్చే నెల (మార్చి) నుంచి నేరుగా విమానసర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి.

Update: 2025-02-26 06:30 GMT

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతకంతకూ దూసుకెళుతోంది. దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఎదుగుతున్న ఎయిర్ పోర్టు.. రానున్న రోజుల్లో పలు విదేశాలకు నేరుగా విమాన సర్వీసుల్ని నడిపేలా పలు విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా మార్చి నుంచి హాంగ్ కాంగ్ కు హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లేలా విమానసర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి హాంకాంగ్ కు వెళ్లాలంటే సింగపూర్.. కౌలాలంపూర్ మీదుగా బ్యాంకాక్ కు చేరుకోవాల్సి ఉండేది. అందుకు భిన్నంగా వచ్చే నెల (మార్చి) నుంచి నేరుగా విమానసర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 20 నగరాలకు నేరుగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమాన సర్వీసులు ఉన్నాయి. రానున్న 18నెలల్లో దశల వారీగా మరిన్ని అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ ఏర్పాటు కానున్నట్లు చెబుతన్నారు.

హాంకాంగ్ తో పాటు అడిస్ అబాబా, ఆమ్ స్టర్ డామ్, రియాద్ లకు కొత్తగా విమాన సర్వీసుల్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఆయా ఎయిర్ లైన్స్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లుగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ అడిస్ అబాబాకు డైరెక్టు ఫ్లైట్లను నడపనున్నారు. సెప్టెంబరులో అమ్ స్టర్ డ్యామ్ కు డైరెక్టు సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. రియాద్ కు సైతం నేరుగా వెళ్లే సర్వీసులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే ఏప్రిల్ మధ్యలో మరిన్ని అంతర్జాతీయ నగరాలకు నేరుగా విమానాలు హైదరాబాద్ నుంచి టేకాఫ్ తీసుకోనున్నాయి.

గడిచిన కొద్ది నెలల్లో హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీగా ప్రయాణాలు నమోదవుతున్నాయి. కరోనాకు ముందు రద్దీని ఎప్పుడో దాటేయటం గమనార్హం. 2019-20 మధ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 32 లక్షల మంది రాకపోకలు సాగించగా.. 2023-24లో ఈ సంఖ్య ఏకంగా 42 లక్షలకు పెరిగింది. ఇప్పుడు మరింత పెరిగినట్లుచెబుతున్నారు. రానున్నకొద్ది నెలల్లో పారిస్.. ఆస్ట్రేలియా.. హోచిమిన్ సిటీ.. హనోయ్.. క్రాబీ.. కఠ్మాండు.. మదీనా నగరాలకు హైదరాబాద్ నుంచి నేరుగా విమనాసర్వీసులు అందుబాటులోకి రానున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేసే వారికి టైం ఆదా అవుతుందనటంలో సందేహం లేదు.

Tags:    

Similar News