ఇది కదా.. ప్రజాభిమానమంటే.. తెలంగాణకు, మధ్యప్రదేశ్‌కు ఎంత తేడా!
ప్రస్తుతం ఆయన కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మధ్య ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది.
ప్రజాభిమానం అంటే.. కొనేది కాదు. ఒకవేళ కొన్నా.. అది ఎంతో కాలం నిలవదు కూడా. ఒక నాయకుడు గెలవలేదనే కాదు.. గెలిచిన నాయకుడికి పదవి దక్కలేదని కన్నీరు పెట్టే అభిమానులు ఎంత మందికి ఉన్నారు? ఎందుకంటే.. నేతలు.. అలా తయారయ్యారు. ఓటు వేయించుకుని.. పక్కకు తప్పుకోవడం అనే కాన్సెప్టునే నాయకులు పాటిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా పేరుకు మాత్రమే అభిమానులుగా ఉంటున్నారు. మనసులోంచి మాత్రం ఆ అభిమానం కనిపించడం లేదు.
ఒకప్పుడు పుచ్చల పల్లి సుందరయ్య మరణిస్తే.. ఆర్టీసీ ప్రత్యేకంగా విజయవాడకు బస్సులు నడిపింది. ఇక, విజయవాడలో కాలు పెట్టేందుకు కూడా చోటు లేనంత గా జనాలు తరలి వస్తే.. ప్రకాశం బ్యారేజీ దాకా కూడా బస్సులను నడపలేమని అదే ఆర్టీసీ బస్సులు నిలిపివేసింది. అదీ అప్పట్లో ఆ మహానేతకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, అభిమానం. ఇక, ఇలాంటి నాయకుడిని చూడడం సాధ్యమేనా అనుకున్న సమయంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కనిపించారు.
ప్రస్తుతం ఆయన కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మధ్య ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. అదికూడా కనీవినీ ఎరుగనివిధంగా జయకేతనం ఎగురవేసింది. దీని వెనుక సీఎంగా శివరాజ్ ఉన్నారు. అయితే.. అధికారం దక్కించుకున్నాక.. బీజేపీ ప్లేట్ ఫిరాయించి చౌహాన్‌ను సీఎం సీటు నుంచి తప్పించేసింది. కనీసం.. మంత్రిగా కూడా అవకాశం ఇవ్వలేదు.
ఇప్పుడు ఇదే విషయంపై అక్కడి మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. చౌహాన్‌ను వెతుక్కుంటూ వచ్చి.. ఆయనను పట్టుకుని.. విలపిస్తున్నారు. మీరే మా సీఎం అంటూ.. రోదించారు. మిమ్మల్ని చూసే ఓటేశామని.. మీరే సీఎంగా ఉండాలని వారు కన్నీరు మున్నీరు పెట్టుకున్నారు. దీంతో వారిని ఓదార్చడం.. చౌహాన్ వల్ల కాలేదు. దీనిని చూసిన సోషల్ మీడియా జనాలు.. ఇంత అభిమానం సంపాయించుకోవడం.. ఎంత మందికి సాధ్యమని అంటున్నారు. తెలంగాణలో ఇలాంటి తరహా వాతావరణం కనిపించకపోవడాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు.