వామ్మో ఇదెక్కడి సిత్రం.. ఫోన్ రిపేర్ చేయించలేదని సూసైడ్

ఆత్మహత్య చేసుకోవటానికి గతంలో చాలా పెద్ద కారణాలు ఉండేవి. మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి.

Update: 2024-04-12 05:59 GMT

ఆత్మహత్య చేసుకోవటానికి గతంలో చాలా పెద్ద కారణాలు ఉండేవి. మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. చిన్నచిన్న కారణాలకే.. బతుకును బుగ్గిపాలు చేసుకుంటున్న వైనాలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. వినేందుకు చాలా చిన్న కారణంగా అనిపిస్తున్న వాటికి సైతం ప్రాణాలు తీసుకుంటున్న వైనాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. తాజాగా అలాంటి ఉదంతమే తెలంగాణలో చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతి.. చెడిపోయిన సెల్ ఫోన్ ను ఇంట్లో వారు బాగుచేయించలేదన్న కోపంతో ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. సారక్క.. స్వామి దంపతులకు ఇద్దరు కొడుకులు.. ఒక కుమార్తె ఉన్నారు. పందొమ్మిదేళ్ల సాయిషుమా మంచిర్యాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ చెడిపోవటంతో దాన్ని బాగు చేయాలని కోరింది. దీనికి తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తరచూ ఫోన్ రిపేర్లకు వస్తోందని.. ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా రిపేర్ కొంతకాలం వాయిదా వేయాలని కోరింది. దీనికి సాయిసుషుమా వేదనకు గురైంది. అన్న అడిగితే అన్నీ చేస్తారని.. తాను అడిగితే ఏమీ చేయరంటూ మనస్తాపానికి గురైంది.

తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఉరి వేసుకున్న విషయాన్ని కాసేపటికి గమనించిన ఇంట్లోని వారు హుటాహుటిన ఆమెను ఉరి ఉచ్చు నుంచి తప్పించి.. కిందకు దింపారు. అప్పటికే ఆమె చనిపోయినట్లుగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చిన్న కారణాలకే మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News