రేషన్ కార్డు కాదు స్మార్ట్ కార్డు

స్మార్ట్ కార్డు మాదిరిగా రేషన్ కార్డుని మార్చేస్తున్నారు. చాలా చిన్నగా ఇంకా చెప్పాలీ అంటే ఏటీఎం కార్డు మాదిరిగా చేసి దానిని అందిస్తారు అన్న మాట.;

Update: 2025-04-02 04:04 GMT
రేషన్ కార్డు కాదు స్మార్ట్ కార్డు

స్మార్ట్ కార్డు మాదిరిగా రేషన్ కార్డుని మార్చేస్తున్నారు. చాలా చిన్నగా ఇంకా చెప్పాలీ అంటే ఏటీఎం కార్డు మాదిరిగా చేసి దానిని అందిస్తారు అన్న మాట. ఈ స్మార్ట్ కార్డుని ఒక్కసారి తీసి చెక్ చేస్తే చాలు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు వస్తాయి. అదే విధంగా ఈ స్మార్ట్ కార్డుల విశేషం ఏంటి అంటే కొత్త సభ్యులను చేర్చుకోవడం పాత సభ్యులను ఎవరైనా అవసరం లేకపోతే తొలగించడం స్ప్లిట్ కార్డులకు ఆప్షన్లు ఉంటాయని అంటున్నారు. అంతే కాదు క్యూ ఆర్ కోడ్ తో పాటు ఇతర సెక్యూరిటీ ఫీచర్స్ తో ఈ కొత్త కార్డులను తయారు చేస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియచేశారు.

ప్రస్తుతం ఈకేవైసీ జరుగుతోంది. తెల్ల రేషన్ కార్డుదారులు అంతా డీలర్ వద్దకు వచ్చి ఈకేవైసీ చేయించుకోవాలి. అలా చేసుకోకపోతే వారి మెంబర్ షిప్ రద్దు అవుతుంది. దీనికి గడువు మార్చి 31తో ముగిసిపోగా ప్రభుత్వం మరో నెల పొడిగించింది. అంటే ఏప్రిల్ 30 దాకా అన్న మాట.

ఆ రోజుతో ఈకేవైసీ నమోదు సరి. ఆ మీదట కార్డులలో అర్హులు ఎవరు అసలైన లబ్దిదారులు ఎవరు అన్నది చూస్తారు. ఎందుకంటే ఈ కేవైసీ ఆధార్ కార్డుని జోడిస్తారు. అందులో కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఉండడమే కాదు వారి బ్యాక్ ఖాతాల వివరాలూ ఉంటాయి.

దానిని బట్టి ఎవరు పేదలు ఎవరు ధనికులు అన్నది తెలిసిపోతుంది అని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేశారు అని అంటున్నారు. దాని వల్ల ఏకంగా కోటిన్నర మందికి పైగా పేదలుగా తేలుస్తోంది. ఏపీలో నాలుగున్నర కోట్లకు పైగా కుటుంబాలు ఉంటే ప్రతీ మూడు కుటుంబాలలో ఒకరు పేదలుగా తేలుతోంది.

ఇక తెల్ల రేషన్ కార్డుదారులకే సంక్షేమ పధకాలు అన్నీ వర్తిస్తాయి. దాంతో ఏ పధకం అమలు చేయాలన్నా కూడా అనర్హులు ఉంటే కనుక ఖజానాకు భారం అవుతుంది అని భావించే ప్రభుత్వం ముందుగా తెల్ల రేషన్ కార్డుల నుంచే చెక్ పెట్టాలని చూస్తోంది అని అంటున్నారు. అదే సమయంలో అన్ని అర్హతలు ఉండి కార్డు లేకపోతే మంజూరు చేస్తారు అని అంటున్నారు.

ఇందులో ఎవరి సిఫార్సు లేకుండానే వివరాలను బట్టి ఆధార్ కార్డులో ఉన్న సమాచారం బట్టే ఎవరు తెల్ల కార్డు దారులు ఎవరు కాదు అన్నది తెలిసిపోతుంది అని అంటున్నారు. ఆ మీదట అన్నీ మధింపు చేసుకుని టోటల్ గా తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరు అన్నది చూసిన మీదటనే వారికి స్మార్ట్ కార్డులు ఇస్తారని అంటున్నారు.

ఇవి పర్మనెంట్ గా ఉండేలా చూస్తున్నారు. వీటి మీద ప్రభుత్వ రాజ ముద్ర తప్ప ఏ రకమైఅ ఫోటోలూ లేకుండా చూస్తున్నారు అని అంటున్నారు. దాని వల్ల వీటిని మాటి మాటికీ మార్చుకునే అవసరం లేకుండా డిజైన్ చేయిస్తున్నారు అని అంటున్నారు. సో రేషన్ కార్డు అని పెద్ద కార్డుతో రావాల్సిన పని లేదు హ్యాపీగా పర్సు లో పట్టే స్మార్ట్ కార్డుతో రావచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News