రాజ‌కీయ పార్టీల‌కు జ‌వాబుదారీ త‌నం ఉండ‌దట‌!

తాజాగా సుప్రీంకోర్టులో దాఖ‌లైన ఓ పిటిష‌న్‌కు సంబంధించి కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ మేర‌కు త‌న వాద‌న‌ల‌ ను వినిపించింది.

Update: 2023-07-27 04:30 GMT

దేశ‌వ్యాప్తంగా ఉన్న రాజ‌కీయ పార్టీల కు ఎలాంటి జవాబు దారీ తనం ఉండ‌కూడ‌ద‌ని కేంద్రం లోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తేల్చి చెప్పేసింది. ఆయా పార్టీలు తీసుకునే విరాళాలు.. ఇచ్చే హామీలు.. ప్ర‌జ‌ల కు చెప్పే మాట‌లు ఇలాంటి ఏ విష‌యంలో అయినా.. వాటిని జ‌వాబుదారీత‌నం కోరేందుకు వీలు లేద‌ని పేర్కొన‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. తాజాగా సుప్రీంకోర్టులో దాఖ‌లైన ఓ పిటిష‌న్‌కు సంబంధించి కేంద్ర‌ప్ర‌భుత్వం ఈ మేర‌కు త‌న వాద‌న‌ల‌ ను వినిపించింది.

వాస్త‌వానికి స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ప్ర‌తి పౌరుడికి కొన్ని హ‌క్కులు క‌ల్పిస్తూ.. 2005లో కేంద్రం నిబంధ‌న‌లు ఏర్పాటు చేసింది. అయితే.. ఈ చ‌ట్టం కేవ‌లం ప్ర‌భుత్వ విభాగాల‌ కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంద‌ని.. రాజ‌కీయ పార్టీల‌ కు వ‌ర్తించ‌ద‌ని కేంద్ర‌మే పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఓ ఉత్తర్వు ఆధారంగా దేశం లోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకువచ్చేలా ఆదేశించాల‌ ని కోరడం సరికాదని తేల్చి చెప్పింది.

అస‌లు ఎవ‌రూ కూడా అలా విజ్ఞపి చేయలేరని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వాల నుంచి వివిధ రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధిపొందుతున్న రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధి లోకి తీసుకురావాలంటూ ఏడీఆర్‌ సంస్థ, సీనియర్‌ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ్ లు వేర్వేరుగా రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్ల పై విచార‌ణ సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం పైవిధంగా వాద‌న‌లు వినిపించ‌డం ప‌ట్ల మేధావులు.. ప్ర‌జాస్వామ్య వాదులు సైతం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. దీని పై సుప్రీం కోర్టు తీర్పు వెలువ‌రించాల్సి ఉంది.

Tags:    

Similar News