వలంటీర్లను రంగంలోకి దింపుతున్న బాబు..!
సీఎం చంద్రబాబు అంటేనే.. సర్వేలకు పెట్టింది పేరు. తనపై తానే సర్వేలు చేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా ఆయన గతంలోనే పేరు తెచ్చుకున్నారు.
సీఎం చంద్రబాబు అంటేనే.. సర్వేలకు పెట్టింది పేరు. తనపై తానే సర్వేలు చేయించుకున్న ఏకైక ముఖ్యమంత్రి గా ఆయన గతంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇక, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు పేరుతోనూ.. ఆయన ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి.. వాటికి అనుగుణంగా పాలనను సంస్క రించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా సంస్కరణల పేరుతో.. కూటమి సర్కారు విషయంలోనూ ఆయన అదే బాటలో నడుస్తున్నారు. పట్టుమని ఆరు మసాలు కూడా కాకుండానే ప్రభుత్వ పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు.
ఇంకా చేయిస్తున్నారు కూడా. గత నెల రోజుల్లో ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ రూపంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒకప్పుడు పార్టీ పదవుల పంపకంలోనూ నియోజకవర్గాల వారీగా నాయకుల పనితీరుపై చంద్రబాబు సర్వేలు చేయించారు. ఇటీవల కూటమి పార్టీల మంత్రుల విషయంలోనూ ఇలా నే సర్వేలు చేయించి.. వారికి మార్కులు వేశారు. తాజాగా ప్రభుత్వ పనితీరుపై ఆయన పూర్తిగా ఐవీఆర్ ఎస్ సర్వే ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.
అయితే..ఈ సర్వేలో ఫలితాలు వచ్చిన తర్వాత.. ఇప్పుడు మరో సర్వేకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈసారి భౌతికంగానే ప్రజలను కలుసుకుంటారు. నాలుగు రోడ్ల జంక్షన్ల నుంచి టీ కొట్లు, బడ్డీ కొట్లు.. వద్ద పోగయ్యే జనాలను పలకరిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర కార్యక్ర మాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు.. వంటివాటిపై నేరుగా ప్రశ్నలు గుప్పిస్తారు వారు ఏమనుకుంటు న్నారన్న విషయాలను తెలుసుకుంటారు. దీనిపై రిపోర్టులు రూపొందించి సర్కారుకు చేరవేస్తారు.
దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు సమగ్రమైన ప్రణాళికను అధికారులకు వివరించారు. ప్రజల మధ్యకు వెళ్లేందుకు వలంటీర్ల సేవలను వినియోగించుకునే అవకాశంపై ఆయన చర్చించారు. పార్టీ నాయకులను రంగంలోకి దింపితే.. అసలైన ప్రజల అభిప్రాయాలు వ్యక్తం కాకపోవచ్చని అభిప్రాయప డిన చంద్రబాబు.. భౌతిక సర్వేల కోసం.. వలంటీర్లను రంగంలోకి దింపితే బెటర్ అని భావిస్తున్నట్టు తెలిసింది. గత ఏడాది విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వలంటీర్ల సేవలను వినియోగించుకు న్నట్టుగానే ఇప్పుడు భౌతిక సర్వేలకు వారిని రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోందని అధికారులు తెలిపారు.