ప్రతిభకు అన్యాయం.. టీమ్ ఇండియాలో స్పేర్ టైర్ కంటే అతడు ఘోరం!
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడడంతో రాహుల్ కు కీపింగ్ చేయక తప్పలేదు.;
అండర్ 19 స్థాయిలోనే అతడు గొప్ప క్రికెటర్ అవుతాడని అనుకున్నారు.. దేశవాళీల్లో దుమ్మురేపుతుండటంతో మరో రాహుల్ ద్రవిడ్ దొరికాడన్నారు.. 22 ఏళ్లకే జాతీయ జట్టులోకి వచ్చేసి సెంచరీలు కొట్టడంతో భవిష్యత్ సూపర్ స్టార్ అతడే అన్నారు.. ఓ దశలో కెప్టెన్ కూడా అనుకున్నారు.. కానీ, పదేళ్లయినా ఇంకా అతడికి జట్టులో చోటు సుస్థిరం కాలేదు.. టి20లకు తీసుకోవడం లేదు.. వన్డేల్లో కూడా నేరుగా పరిగణించడం లేదు.. టెస్టులకు మాత్రమే కాస్తోకూస్తో చాన్స్ ఇస్తున్నారు..
మూడు ఫార్మాట్లలోనూ అతడు ఓపెనింగ్ కు దిగుతాడు.. మిడిలార్డర్ లో వస్తాడు.. వికెట్ కీపింగ్ చేస్తాడు.. జట్టులో చోటు లేదు బెంచ్ పై కూర్చోమన్నా కూర్చుంటాడు.. కానీ, అతడు మాత్రం దేనికీ బాధపడడు.. అతడే కేఎల్ రాహుల్.. తాజాగా ఆస్ట్రేలియాతో చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో కోహ్లికి మంచి సపోర్ట్ ఇచ్చి.. భారీ సిక్స్ తో రాహుల్ మ్యాచ్ ను ముగించడంతో అందరూ అతడిని హీరోలా చూస్తున్నారు.
వాస్తవానికి రాహుల్ టీమ్ ఇండియా కెప్టెన్ కావాల్సిన వాడు. కానీ, అతడిని టైమ్ వెంటాడింది.. మ్యాచ్ విన్నర్ కాలేకపోవడం, గాయాలు, కీలక సమయాల్లో వైఫల్యంగో కెరీర్ వెనుకబడింది. రెండు, మూడేళ్లుగా మాత్రం కాస్త గాడిన పడింది. కారణం.. వికెట్ కీపింగ్ కూడా చేస్తుండడమే.
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడడంతో రాహుల్ కు కీపింగ్ చేయక తప్పలేదు. దీనిని అతడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాహుల్ గురించి టీమ్ ఇండియా మాజీ బ్యాట్స్ మన్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. టీమ్ ఇండియాలో సైలెంట్ కిల్లర్ కేఎల్ రాహుల్ అని.. జట్టుకు ఏ అవసరం ఉన్నా.. అతడు సిద్ధంగా ఉంటాడని కొనియాడారు.
టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్ ను స్పేర్ టైర్ ను మించి వాడారని సిద్ధూ పేర్కొన్నారు. కీపింగ్.. ఆరో స్థానంలో బ్యాటింగ్.. ఒక్కోసారి ఓపెనింగ్.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ వంటి సిరీస్ లలో వన్ డౌన్.. మళ్లీ ఓపెనింగ్.. ఇలా అనేక బాధ్యతలను రాహుల్ నెత్తిన మోపారాని అయినా అతడు అన్నిటినీ సమర్థంగా నిర్వర్తించాడమని సిద్ధూ విశ్లేషించారు.
వన్డేల్లో ఓపెనింగ్ తేలికే అయినా.. టెస్టుల్లో మాత్రం చాలా కష్టం అని.. పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నచోటే ఆడమని రాహుల్ ను కోరడం.. అతడు అంగీకరించడం సహజంగా మారిందని సిద్ధూ వివరించారు.
దేశం కోసం నిస్వార్థంగా త్యాగం చేసేవారు గొప్పవారని.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఇలానే చేశారని.. అందుకే ఆయనకు అంత పేరొచ్చిందని సిద్ధూ భావోద్వేగంగా చెప్పారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ ద్వారా రాహుల్ వన్డేల్లో 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే, 11 ఏళ్లలో అతడు ఆడింది 84 వన్డేలు మాత్రమే. 88 స్ట్రయిక్ రేట్ కాగా.. సగటు 48.53 కావడం విశేషం. ఏడు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశాడు.