జగన్ పంచ్ కి పవన్ కౌంటర్ అక్కడే...అపుడే ?

పవన్ కి కార్పోరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్ వేసిన పంచ్ తో జనసేన రగిలిపోతోంది.;

Update: 2025-03-06 20:30 GMT

సరైన సమయంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అస్త్రం అందించారా అన్న చర్చ సాగుతోంది. పవన్ కి కార్పోరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్ వేసిన పంచ్ తో జనసేన రగిలిపోతోంది. ఎంతలా అంటే టాప్ టూ బాటం అంతా అని చెప్పాలి.

జనసేనలో నంబర్ టూ గా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వెంటనే జగన్ కి కౌంటర్ ఇచ్చారు. కోడి కత్తికి ఎక్కువ గొడ్డలి పోటుకు తక్కువ అని కెలికారు. కానీ అది ఏమంత పెద్దగా పోవడం లేదు. జగన్ వేసిన పంచే ఇప్పటికీ వైరల్ గా మారుతోంది.

ఏకంగా పవన్ ని రాజకీయాల్లో ఏమీ కానట్లుగా తీసివేసినట్లుగా ఈ పంచ్ ఉందని జనసన నేతలు మండిపోతున్నారు. జగన్ పంచ్ కి సరైన కౌంటర్ రావాలంటే అది పవన్ కళ్యాణ్ నోటి నుంచే రావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. అంతే కాదు పవన్ అవేశంతో ఆగ్రహంతో జగన్ మీద విరుచుకుపడితేనే సైనికులకు ఒక సంతృప్తి గా ఉంటుంది అని అంటున్నారు.

మామూలుగా అయితే ఒక మీడియా మీటో లేక ఒక సభ వంటిదో ఇలాంటి వాటికి పవన్ కి ఉండాలి. ఇపుడు అలాంటి సందర్భమే వస్తోంది. మరో వారంలో జనసేన పార్టీ పండుగ ఉంది. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభలో భాగంగా పవన్ పబ్లిక్ ని ఉద్దేశించి స్పీచ్ ఇస్తారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత పంచ్ కి ధీటైన జవాబు చెబుతారు అని అంటున్నారు.

అంటే మరో వారం వరకూ ఆగితే పవన్ పవర్ ఫుల్ పంచ్ వస్తుందని అంటున్నారు. పవన్ వేసే పంచులు హై లెవెల్ లో ఉంటాయి. దానికి ఫైర్ ని ఆయన జోడించి తన బాడీ లాంగ్వేజ్ ని మిక్స్ చేసి ఇస్తే కనుక అది ఏ రేంజిలో దూసుకునిపోతుందో వేరేగా చెప్పాల్సింది లేదు అని అంటున్నారు. గతంలో పవన్ అనేక సభలలో జగన్ మీద నేరుగా ఎటాక్ చేశారు. ఆయన మీద డైలాగ్ వార్ నే నడిపించారు.

వారాహి సభలలో పవన్ వేసిన పంచులు డైలాగులు సెటైర్లు ఒక మోత మోగాయి. అయితే అధికారంలోకి వచ్చాక పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో కొంత తగ్గి ఉంటున్నారు. నాటి దూకుడుని ఆయన చూపించడం లేదు. విమర్శలు కూడా సహేతుకంగానే ఉంటున్నాయి.

కానీ ఇపుడు జగన్ వేసిన పంచ్ తో మళ్ళీ పవన్ కి పని పడింది అని అంటున్నారు. దాంతో ఆయన నుంచి ఏ రకమైన ఎటాక్ వస్తుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. పవన్ కనుక కెలుకుడు మొదలెడితే అది మామూలుగా ఉండదని జనసైనికులు ఇప్పటికే అంటున్నారు. మరి పవన్ కనుక కౌంటర్ ఇస్తే దానికి వైసీపీ నుంచి నేతల నుంచి కూడా రివర్స్ ఎటాక్ ఉంటుంది. దాంతో ఏపీ రాజకీయం వేసవి ఎండలలో మరోసారి మండేలే కనిపిస్తోంది. ఇక పవన్ కౌంటర్ కి జగన్ నుంచి ఏదో మీడియా సమావేశంలో ఎటాక్ ఉండే చాన్స్ కొట్టిపారేయలేమని అంటున్నారు. సో కొన్నాళ్ళ నుంచి ఏపీలో సైలెంట్ గా ఉన్న పాలిటిక్స్ కి ఇది బిగ్ ట్విస్ట్ గానే చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News