యూఎస్ బీచ్ లో తెలుగమ్మాయి డెడ్ బాడీ లభ్యం!

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని రియాల్టో బీచ్‌ లో తెలుగు మహిళ శ్వేత చిరుమామిళ్ల (26) శవమై కనిపించింది

Update: 2023-09-29 07:42 GMT

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని రియాల్టో బీచ్‌ లో తెలుగు మహిళ శ్వేత చిరుమామిళ్ల (26) శవమై కనిపించింది. శ్వేత తన స్నేహితులతో కలిసి సీటెల్‌ కు వాయువ్య ఒలంపిక్ ద్వీపకల్పంలోని బీచ్‌ లో ఉన్నప్పుడు ఒక భారీ అల ముంచివేసిందని తెలుస్తుంది. ఈ ఘటన సోమవారం ఉదయం 10:50 గంటల ప్రాంతంలో జరిగింది. దీంతో... వెంటనే యూఎస్ కోస్ట్ గార్డ్ అధికారులు సమాచారం అందించారు.

అవును... స్నేహితులతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్లిన తెలుగు మహిళ శ్వేత శవమై కనిపించింది. ఈమె సోమవారం సముద్ర అలల భారిన పడగా... ఆమె మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు బుధవారం సాయంత్రం పూర్తయ్యాయని ఒలింపిక్ నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై అధికారులు మరిన్ని వివరాలు తెలిపారు.

సోమవారం అదృశ్యమైన మహిళను సీటెల్‌ కు చెందిన శ్వేత చిరుమామిళ్లగా గుర్తించామని.. 26 ఏళ్ల ఆ యువతి ఇద్దరు స్నేహితులతో కలిసి బీచ్‌ లో హైకింగ్ చేస్తుండగా.. ఒక భారీ అల దాడి చేసిందని.. దీంతో ఆమె అదృశ్యమైందని నేషనల్ పార్క్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీస్ తెలిపింది.

వాస్తవానికి సోమవారం ఉదయం ఆమె సముద్రంలోకి కొట్టుకుపోగానే అధికారులకు సమాచారం అందింది. దీంతో రెండు హెలికాప్టర్లతో కోస్ట్ గార్డ్ టీం, ఒలింపిక్ నేషనల్ పార్క్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీం సహాయంతో రెస్క్యూ ప్రయత్నంలో పాల్గొంది. ఈ నేపథ్యంలో సుమారు ఐదు గంటలపాటు వెతికిన తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రేంజర్లు చిరుమామిళ్ల మృతదేహాన్ని గుర్తించారు.

అయితే అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అధికారులు బుధవారం సాయంత్రం వరకు రికవరీ ఆపరేషన్‌ ను పూర్తి చేయలేకపోయారని తెలుస్తుంది. శ్వేత చిరుమామిళ్ల కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News