ఉచిత బూడిద కోసం కూటమి నేతల కుమ్ములాటలు... బాబు కీలక వ్యాఖ్యలు!

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-27 13:30 GMT

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లైయాష్ కోసం జమ్మలమడుగు, తాడిపత్రి నియోజకవర్గాల్లోని కూటమి నేతల మధ్య రచ్చ నెలకొందని అంటున్నారు. దీనిపై ఎద్దేవాతో కూడిన కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు సీరియస్ గా స్పందించారు.

అవును... ఫ్లైయాష్ కోసం రచ్చ చేస్తోన్న ఇద్దరు కూటమి పార్టీలకు చెందిన నేతల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో.. టీడీపీ, బీజేపీ నేతలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు! దీనిపై జిల్లా అధికారులతో మాట్లాడారని అంటున్నారు.

అనంతరం.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఈ విషయంలో శాంతిభద్రతల సమస్య రాకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారని తెలుస్తోంది.

ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ఈ ఆర్టీపీపీ ఉచిత బూడిద కోసం రెండు నియోజకవర్గాల నేతల మధ్య పోటాపోటీ నెలకొందని అంటున్నారు. మరోపక్క ముద్దనూరు, కొండాపురం, తాళ్ల పొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మొహరించారు.

కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపాలిటీ సంఘం ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఈ ఆర్టీపీపీ బూడిదను తోలుకోవడం ప్రారంభించారు. అయితే... దీనికి ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుచెప్పారు. దీంతో.. వివాదం ముదిరి పాకాన పడింది.. సీఎం స్పందించే స్థాయికి చేరింది.

మరోపక్క ఆదినారాయణ రెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమలకు చేరకుందా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో... ఆర్టీపీపీ - తాడిపత్రి మార్గంలో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. తమ వాహనాల్లో బూడిద నింపకపోతే తానే నేరుగా రంగంలోకి దిగుతానంటూ ప్రభాకర్ రెడ్డి.. ఎస్పీకి లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News