తిరుమల లడ్డూ వ్యవహారం... మాజీ స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు!
గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పలు రంగాలకు చెందిన సెలబ్రెటీలు వారి వారి స్పందనను తెలియజేస్తున్నారు. ఈ విషయంలో కొంతమంది మధ్య నెట్టింట హాట్ చర్చ జరుగుతుంది. మరోపక్క ఏపీ రాజకీయాల్లో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ వ్యవహారంపై అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. మరోపక్క ఈ నెల 28 (శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చింది వైసీపీ.
ఈ విధంగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ వ్యహారం చుట్టూ ఆంధ్రప్రదేశ్ లో రసవత్తర రాజకీయం నడుస్తొంది. ఈ సమయంలో మాజీ స్పీకర్, వైసీపీ నేత తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు.
అవును... తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై తాజాగా తమ్మినేని సీతారాం స్పందించారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై స్పందించిన ఆయన... పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారూ చేసే నెయ్యి.. ఆవాలు, పామాయిల్, అవిశలు వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకొనే ఆవుల పాల నుంచి తయారు చేసిన నెయ్యి.. అది కావొచ్చు అంటూ స్పందించారు!
ఇదే సమయంలో... కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని.. అలాంటప్పుడు మాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని సీతారాం ప్రశ్నించారు. అదేవిధంగా... పరీక్షల్లో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని ఎస్.డి.బీ.బీ. తన నివేదికలో స్పష్టం చేసిందని మాజీ స్పీకర్ వెళ్లడించారు.
ఇలాంటి విషయాల్లో ఏవైనా ఉన్న లోపాలు ఏమిటి.. అసలు జరిగిందేమిటి అనేది తెలుసుకొవాలని.. ఎంతో భద్రతగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడి విలువను మనమే తగ్గించుకోవడం అవుతుందని.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని తమ్మినేని విమర్శించారు.