ఎవరికి వారే యమునా తీరే !

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు టార్గెట్. అధికారంలోకి రావటం ఒక ఎత్తయితే కడప జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం మరో టార్గెట్.

Update: 2024-01-11 13:30 GMT

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం చంద్రబాబు నాయుడు టార్గెట్. అధికారంలోకి రావటం ఒక ఎత్తయితే కడప జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం మరో టార్గెట్. టార్గెట్లు పెట్టుకోవటం వరకు బాగానే ఉన్నా దాన్ని అందుకోవటానికి అవసరమైన కార్యాచరణను అమలు చేస్తున్నారా ? ఇక్కడే చంద్రబాబు టార్గెట్ రీచవ్వటంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్నారు. ఏ ఇద్దరు నేతల మధ్యా సమన్వయం లేకపోవటమే పార్టీకి అసలైన సమస్యగా మారుతోంది.

కడప జిల్లాలో వైఎస్ కుటుంబజిల్లాలో పాపులరైంది. ఇలాంటి జిల్లాలో టీడీపీ మెజారిటి సీట్లు గెలవాలంటే యాక్షన్ ప్లాన్ ఎంతటి పకడ్బందీగా ఉండాలి ? ఇప్పటివరకు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించలేదు. కడప జిల్లాపైన ప్రత్యేకంగా దృష్టిపెట్టి మెజారిటి సీట్లు గెలవాలని అనుకున్నపుడు అందుకు యాక్షన్ కూడా చాలా స్పీడుగా ఉండాలి. పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో తప్ప ఇంకెక్కడా అభ్యర్ధులను ప్రకటించలేదు. ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రైల్వేకోడూరు, బద్వేలు లాంటి నియోజకవర్గాల్లో అయితే బహు నాయకత్వంతో పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి.

నియోజకవర్గాలకు ఇన్చార్జిలను కూడా చంద్రబాబు వేయలేకపోయారు. ఎన్నికలు మరో మూడునెలల్లోకి వచ్చేసిన నేపధ్యంలో ఇప్పటికీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను వేయలేకపోయారంటే పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. అలాగే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. పొత్తులో జనసేనకు ఎన్నిసీట్లిస్తారు ? ఆ నియోజకవర్గాలేవి అన్న విషయంలో తమ్ముళ్ళకి క్లారిటిలేదు. ఒకపుడు జిల్లాలో టీడీపీ బలంగానే ఉన్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కారణంగాపార్టీ దెబ్బతినేసింది.

వైఎస్ కారణంగా జిల్లాలో పార్టీ దెబ్బతిన్నదంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. పది నియోజకవర్గాల్లో ఎక్కడా టీడీపీ గెలవలేదు. 2014 ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే పరిస్ధితి. గడచిన రెండు ఎన్నికల్లో ఏమి జరిగిందో చూసికూడా 2024 ఎన్నికలకు పార్టీని చంద్రబాబు రెడీ చేయటంలేదు. అభ్యర్ధులను ముందే ప్రకటిస్తే కదా జనాల్లోకి వెళ్ళి వైసీపీకి ధీటుగా పోటీ ఇచ్చేది. మరీ విషయం తెలిసికూడా చంద్రబాబు ఎందుకని పట్టించుకోవటంలేదో అర్ధంకావటంలేదు. ఇలాగైతే జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం ఎలాగని తమ్ముళ్ళకు దిక్కుతోచటంలేదు.

Tags:    

Similar News