ఎమోషనల్ టచ్ తో టీడీపీ...డిఫెన్స్ లో వైసీపీ...?

అందుకే ఫుల్ ఎమోషనల్ టచ్ తో బాబు అరెస్ట్ జైలు జీవితం ఎపిసోడ్ ని పీక్స్ కి తీసుకెళ్ళేందుకు టీడీపీ భారీ వ్యూహం రచించింది అని అంటున్నారు.

Update: 2023-10-14 08:12 GMT

భారత దేశం ఫుల్లీ ఎమోటెడ్ కంట్రీ. ఈ నేల మట్టి అలాంటివి. రాజకీయాల్లో సెంటిమెంట్లు పడినంతగా మరేదీ పండదు. అందుకే ఫుల్ ఎమోషనల్ టచ్ తో బాబు అరెస్ట్ జైలు జీవితం ఎపిసోడ్ ని పీక్స్ కి తీసుకెళ్ళేందుకు టీడీపీ భారీ వ్యూహం రచించింది అని అంటున్నారు. చంద్రబాబును జైలులో చంపేస్తారు. ఆయన ప్రాణాలకు ముప్పు అంటూ టీడీపీ అంటోంది.

బాబుకు ఏమైనా జరిగితే జగన్ దే బాధ్యత అంటూ జూనియర్ నుంచి సీనియర్ నేతల వరకూ అంతా ఒక్కటే మాట్లాడుతున్నారు. బాబుకు ప్రాణహాని ఎందుకు ఉంటుంది. ఇది కామన్ సెన్స్ తో కూడిన ప్రశ్న. చంద్రబాబు ముమ్మారు సీఎం చేసిన వారు. ఆషామాషీ నేత కానే కారు. ఆయనకు ఏమైనా జరిగితే వచ్చే రిజల్ట్ ఎంతటి దారుణంగా ఉంటుందో అధికారంలో ఉన్న పార్టీకి తెలియదు అనుకోవాలా.

కోరి మరీ వారు తమకు తామే బిగ్ ట్రబుల్స్ క్రియేట్ చేసుకుంటారా. ఇది ఎవరైనా బుర్ర పెట్టి ఆలోచిస్తే తట్టే ప్రశ్న. ఇక చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన పోలీస్ కస్టడీలో అయితే లేరు. ఆయన ఆరోగ్యం ప్రాణాలు అన్నీ కూడా ప్రభుత్వం అతి ముఖ్యమైనవిగా భావిస్తుంది. ఇపుడు బాబు భద్రత అన్నది వైసీపీకి టాప్ ప్రయారిటీ.

ఒకవేళ బాబు జనంలో ఉంటూ ప్రసంగాలు చేసినా ఆయన సెక్యూరిటీ అన్నది ప్రభుత్వం బాధ్యతగానే వస్తుంది. అపోజిషన్ లీడర్ కి ఏమైనా జరిగితే అన్ని వేళ్లూ ప్రభుత్వం మీదనే చూపిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. మరి అయినా సరే బాబుకు ముప్పు ఉందని పదే పదే ఎందుకు చెబుతున్నారు అన్నదే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం.

నిజానికి చంద్రబాబు ముప్పయి నాలుగు రోజులుగా జైలులో ఉన్నారు. ఇన్నాళ్ళు ఆయన జైలులో ఉండడానికి కారణం ఎవరు అన్నది ఒక ప్రశ్నగా వేసుకుంటే ఆయన బెయిల్ పెట్టుకుంటే ఎపుడో వచ్చేది కదా అన్నది న్యాయ నిపుణుల నుంచి వస్తున్న జవాబు. అలా కాకుండా క్వాష్ పిటిషన్ అని బాబు తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టు దాకా వెళ్ళి వాదిస్తున్నారు. క్వాష్ పిటిషన్ మీద విచారణలో కొంత జాప్యం అవుతోంది.

దాని వల్లనే ఆయన జైలు జీవితం గడపాల్సి వస్తోంది. బెయిల్ మీద బాబు బయటకు వస్తే నా మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పలేరు. అదే క్వాష్ పిటిషన్ ద్వారా ఏకంగా రిమాండ్ రిపోర్టునే కొట్టేయిస్తే నా మీద ఒక్కటీ రుజువు చేయలేకపోయారు నేను నిప్పునే నటూ బాబు జనాల్లోకి వచ్చి అధికార పార్టీ మీద అగ్గి రాజేయవచ్చు.

ఇలాంటి వ్యూహంతోనే క్వాష్ పిటిషన్ మీద పట్టుబట్టి ఉన్నారు. అక్కడ ఆలస్యం అవుతోంది. బాబు జైలు జీవితం ఇక్కడ అలా సాగిపోతోంది. మరి ఆయనను ఎలా బయటకు తేవడం అన్నది బిగ్ టాస్క్ గా మారుతోంది పార్టీకి అంటున్నారు. దాంతోనే బాబు హెల్త్ మీద ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.

బాబు అరెస్ట్ జైలు జీవితం జనాలకు పట్టకపోయి ఉండొచ్చు కానీ ఆయన ప్రాణాలకు ఇబ్బంది అంటే కచ్చితంగా జనాలు ఈ వైపు చూస్తారు, ఆలోచిస్తారు. ఆ విధంగా జనాల్లో కొంత సానుభూతి పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోనే బాబు హెల్త్ మీద ఇలా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు. విజయసాయిరెడ్డి వంటి వారు అయితే ఇది డ్రామా అని కొట్టిపారేస్తున్నారు.

జైలులో పూర్తి విశ్రాంతి దొరికి బాబు ఒక కిలో అదనంగా పెరిగారని చెబుతూంటే ఈ విధంగా టీడీపీ ఆయన ప్రాణాలకు ముప్పు అయి ప్రచారం చేయడం వెనక కచ్చితంగా దారుణం అని ఆయన అంటున్నారు. బాబు విషయంలో ఏ రకమైన ప్రచారం జరిగినా అది వైసీపీకే ఇబ్బంది అవుతుంది. ఆయన ఉన్నది జైలులో. దాంతో బయట వారికి ఏమీ తెలియదు.

అటు జైలు అధికారులు ఇటు కుటుంబ సభ్యులు చెప్పిన వాటినే జనాలు ప్రమాణంగా తీసుకుంటారు. ఈ రెండింటిలో కుటుంబ సభ్యుల మాటలకే ఎక్కువ విలువ ఇస్తారు. దాంతో బాబు ఆరోగ్యం బాగులేదు అన్నది పూర్తిగా ఎమోషనల్ ఇష్యూ అవుతుంది. అదెంత ఎమోషనల్ ఇష్యూగా మారుతుందో అంత మేరకు వైసీపీ డిఫెన్స్ లో పడుతుంది. మరి దీనికి విరుగుడు మంత్రం ఏదైనా ఉందా అన్నది అధికార పార్టీ ఆలోచించాలి. బాబు ఆరోగ్యం ఇపుడు ప్రభుత్వానికే అత్యంత అవసరం అన్నది మాత్రం ఎవరూ మరచిపోని విషయం.

Tags:    

Similar News