గుంటూరు పశ్చిమలో కూటమికి కొత్త కష్టాలు!

ఈ విధంగా తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నేతలు, పలువురు కీలక కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలను బాయ్ కాట్ చేశారనే కామెంట్లు ఇప్పుడు స్థానికంగా వైరల్ గా మారాయి.

Update: 2024-05-08 13:30 GMT

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి అనే కామెంట్లు గతకొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ కూటమికి మద్దతుగా, టీడీపీ తరుపున ఉన్నవాళ్లు తాజాగా వదిలిన వీడియోలు చూసినా.. విశ్లేషకుల అభిప్రాయాలు పరిశీలించినా.. కూటమి నేతల ద్వంద్వ వైఖరులను గమనించినా.. అదే విషయం స్పష్టమవుతుందని అంటున్నారు.

అవును... ముస్లిం రిజర్వేషన్ల నుంచి, ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు వరకూ.. పోలవరంపై మోడీ మొన్న చంద్రబాబుకు 'ఏటీఎం'లా మారిందని చెప్పి, ఈ రోజు మాట మార్చి.. విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ పై మాట్లాడకుండా.. వీటిపై చంద్రబాబు కూడా క్లారిటీ ఇవ్వకుండా, పవన్ కల్యాణ్ ప్రశ్నించకుండా కలిసిన ఈ కూటమికి ఊహించని స్థాయిలో సమస్యలు గ్రౌండ్ లెవెల్ లోని నేతల మెడకు బలంగా చుట్టుకుంటున్నాయని అంటున్నారు.

ఇదే క్రమంలో... రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలోనూ మరో ప్రధాన సమస్య కూటమికి తలనొప్పిగా మారిందని అంటున్నారు. బీజేపీ, జనసేనకు కేటాయించిన 31 సీట్లలో కుమ్ములాటల సంగతి ఒకెత్తు అయితే... టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే మిగిలిన 144 స్థానాల్లో కూడా అసంత్రప్తి జ్వాలలు ఎగసి పడుతున్న పరిస్థితి తెరపైకి వచ్చింది! పైగా... అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు అనుసరించిన వైఖరి కూడా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం అని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... గతకొంతకాలంగా జనసేన, బీజేపీ పార్టీలకు సేవలు చేసి.. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మెజారిటీ నేతలు ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి అనేందుకు చాలా ఉదాహరణలే రోజూ కనిపిస్తున్నాయి! దీంతో.. నాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి అన్న అలా చేశాడు.. ఈరోజు తమ్ముడు ఇలా చేస్తున్నాడని దుబ్బయట్టేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని అంటున్నారు.

అధినేతలు ఆలింగనాలు చేసేసుకుని, శాలువాలు కప్పేసుకున్నంత మాత్రాన్న గ్రౌండ్ లెవెల్లో కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు ఆయా స్థానాల్లో టిక్కెట్లు ఆశించిన నేతలు ఎవరూ ప్రచారాల్లో బలంగా తిరగడం లేదని తెలుస్తుంది. తాజాగా చాలా నియోజకవర్గాలతో పాటు గుంటూరు పశ్చిమలోనూ ఇదే పరిస్థితి తెరపైకి వచ్చింది.

ఎప్పటి నుంచో పార్టీకి సేవలందించిన నేతలను కాదని కొత్తగా గళ్లా మాధవిని పార్టీలోకి తీసుకుని ఆమెకు చంద్రబాబు సీటు ఇవ్వడం కొంప ముంచిందనే కామెంట్లు ఇటీవల మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టుకుని, చంద్రబాబు ఎలా చెబితే అలా చేసినా కూడా.. ఎన్నికలు సమీపించేసరికి టిక్కెట్ లేదంటే ఎక్కడికి పోతామని ఆయన మీద రివర్స్ అవుతున్నారు!

ఈ విధంగా తాజాగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నేతలు, పలువురు కీలక కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలను బాయ్ కాట్ చేశారనే కామెంట్లు ఇప్పుడు స్థానికంగా వైరల్ గా మారాయి. పోనీ జనసేన, బీజేపీ నేతలు అయినా తిరుగుతున్నారా అంటే... టిక్కెట్లు ఆశించి భంగపడ్డావారంతా ఇప్పటికే సైడ్ అయిపోయారని చెబుతున్నారు!

దీంతో... ఈ కూటమిలో కుంపటి వ్యవహారం స్థానికంగా విడదల రజనీ మెజారిటీని మరింత పెంచే అవకాశం ఉందనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ చెప్పిన మాటల ప్రకారమే గుంటూరు పశ్చిమలో విడదల రజనీ గెలవడం ఖాయమని నొక్కి చెబుతున్నారు.

దీంతో... ఎన్నికలు మరో కొద్దిరోజులే ఉండటంతో గుంటూరు పశ్చిమ ముఖచిత్రం కూటమికి కష్టంగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు.. చేయగలిగేవే చెబుతున్నాడు.. చెప్పినవే చేస్తున్నాడు. అభూత కల్పనలకి ఎక్కడా ఆస్కారం లేదంటూ జగన్ మేనిఫెస్టోను కొడియాడుతున్నారట ప్రజానికం!

Tags:    

Similar News