ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నందుకు కుటుంబాన్ని చంపేసిన ఇంటర్ విద్యార్థి!

తాజాగా ఒడిశాలో ఓ దారుణం జరిగింది. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ఓ విద్యార్థి ఏకంగా తన తల్లిదండ్రులు, సోదరిని హత్య చేశాడు.;

Update: 2025-03-04 10:30 GMT

నేటి యువతకు విచక్షణ ఉండటం లేదు. చిన్న చిన్న కారణాలకే తీవ్ర ఆగ్రహాంతో ఊగిపోతున్నారు. సోషల్ మీడియా ప్రభావం, పరిసరాల ప్రభావంతో యువత ఎంతకైనా తెగించవచ్చు..ఏమైనా చేసేయవచ్చు..అనే ఆలోచనలో ఉంటున్నారు. కుటుంబ బంధాలు మరుస్తున్నారు. క్షణికావేశంలో పెను నష్టానికి కారణమవుతున్నారు. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు..సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు తాము ఆత్మహత్య చేసుకోవడమో..ఇతరులను కొట్టడమో, చంపడమో చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి నేరాలు పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా ఒడిశాలో ఓ దారుణం జరిగింది. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని ఓ విద్యార్థి ఏకంగా తన తల్లిదండ్రులు, సోదరిని హత్య చేశాడు. ఒడిశాలోని జగత్సింగపూర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయబాడా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తల్లిదండ్రులతో సహా తోబుట్టువును దారుణంగా చంపేశాడు. ఇంటర్ చదివే సూర్యకాంత శెట్టి..తండ్రి ప్రశాంత శెట్టి(58), కనకలత(45), సోదరి రోజాలిన్(16) ల తలలపై బలంగా మోదీ హత్య చేశాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి డెడ్ బాడీలను పోస్టుమార్టానికి తరలించారు.

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసైన ఇంటర్ చదివే విద్యార్థి సొంత కుటుంబాన్ని హత్య చేయడం ఒడిషా రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. నేటి సమాజంలో ఆన్ లైన్ గేమ్స్, వీడియో గేమ్ లు యువతపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. విద్యార్థులు అవగాహన లేమితో ఆన్ లైన్ గేమ్స్ ఆడటం వాటిలో నష్టపోవడం, లక్షల రూపాయలను అందులో పోగొట్టుకుని ఆత్మహత్యల దాక వెళ్తున్నారు. మరికొందరు వీటి వల్ల అప్పుల పాలై ఇతరులను చంపడం చేస్తున్నారు.

ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దు.. సోషల్ మీడియా చూడొద్దు అంటున్న తల్లిదండ్రులు, తోబుట్టువులను కొట్టడానికి, చంపడానికి వెనకాడడం లేదు. వీటి ద్వారా యువతలో నేర స్వాభావం పెరిగిపోతోంది. ఇది సమాజంలో అరాచకాలకు దారితీస్తోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టడి చేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సామాజికవేత్తలు, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఆన్ లైన్ గేమ్స్ యాప్స్ ను బ్యాన్ చేయడంతో పాటు.. వాటి వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు టెక్నాలజీలో ముందుండాలని, సోషల్ స్టేటస్ లో భాగంగా ఖరీదైన సెల్ ఫోన్లు కొనివ్వడం, పాకెట్ మనీకి వేల రూపాయలు ఇవ్వడం వంటివి మానుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. సమాజంలో ఆన్ లైన్ విపరీత పొకడలకు పోతోందని ఈ విషయంలో తల్లిదండ్రులు, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

Tags:    

Similar News