తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్న 37 మద్యం బ్రాండ్లు

అది కూడా ఒకట్రెండు కాదు ఏకంగా 37 కొత్త మద్యం బ్రాండ్లు ముందుకు వచ్చాయి.;

Update: 2025-03-18 07:33 GMT

తెలంగాణ మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. అతి త్వరలో మార్కెట్ లోకి సరికొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. అది కూడా ఒకట్రెండు కాదు ఏకంగా 37 కొత్త మద్యం బ్రాండ్లు ముందుకు వచ్చాయి. మద్యం సరఫరా కోసం గత నెల 23న బేవరేజెస్ కార్పొరేషన్ కొత్త సరఫరాదారుల నుంచి అప్లికేషన్లకు ఆహ్వానించింది.

ఇప్పటికే దేశీయంగా తయారయ్యే మద్యం బ్రాండ్లలో 95 శాతం కార్పొరేషన్ తో రిజిస్టర్ అయిన నేపథ్యంలో మిగిలిన బ్రాండ్లు అప్లై చేస్తాయని భావించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గడువు ముగిసేనాటికి ఏకంగా 37 బ్రాండ్లు దరఖాస్తు వేసుుకున్నాయి. ఇందులో 15 విదేశీ మద్యం బ్రాండ్లు కాగా మరో 15దేశీయ మద్యం బ్రాండ్లు. ఏడు అప్లికేషన్లు బీర్ల సరఫరాకు ముందుకు వచ్చాయి.

ఇక్కడో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నోటిఫికేషన్ లేకుండా కొత్త బ్రాండ్ల సరఫరా కోసం అనుమతి ఇవ్వటం ఏమిటంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేసి.. వివాదాస్పద జాబితాలోకి ఎక్కిన సోం డిస్టలరీస్ కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. బీర్ తో పాటు లిక్కర్ సంస్థలు కూడా అప్లికేషన్ పెట్టిన వైనం బయటకు వచ్చింది. మొత్తం ఫార్మాలిటీస్ పూర్తి చేసేందుకు నెల రోజులు పడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో లిక్కర్ బేసిక్ ధరల్ని పెంచాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. అదే జరిగితే.. మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. ఈ కొత్త బ్రాండ్ల కారణంగా రూ.5 వేల వరకు ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News