ఆ నాలుగు జిల్లాలు బీయారెస్ ని దెబ్బేశాయి...!
మరో వైపు చూస్తే తెలంగాణాలో ఉమ్మడిగా పది జిల్లాలు ఉంటే ఇందులో ఏకంగా నాలుగు జిల్లాలు బీయారెస్ కారు కి బ్రేక్ వేశాయి
ఇపుడు బీయారెస్ లో అంతర్మధనం సాగుతోంది. తాము అభివృద్ధి చేశాం కానీ ఎందుకు ఈ విధంగా ఫలితాలు వచ్చాయని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.ఒక వైపు సంక్షేమం కూడా చేశాం అయినా లబ్దిదారులు ఎందుకు టర్న్ అయ్యారు అన్న ప్రశ్న వేధిస్తోంది.
మరో వైపు చూస్తే తెలంగాణాలో ఉమ్మడిగా పది జిల్లాలు ఉంటే ఇందులో ఏకంగా నాలుగు జిల్లాలు బీయారెస్ కారు కి బ్రేక్ వేశాయి. ఏకంగా గులాబీ జెండానే తల్లకిందులు చేశాయి. ఆ నాలుగు జిల్లాలలో ఖమ్మం ముందుగా తీసుకుంటే ఈ జిల్లాలో పది సీట్లు ఉంటే 2014లో బీయారెస్ గెలిచింది ఒక్క సీటు, 2018లో కూడా ఒకే ఒక్క సీటుని బీయారెస్ గెలిచింది. ఇపుడు కూడా ఒక్క సీటే బీయారెస్ కి లభించింది. అలా భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ గెలిచారు.
ఇక మరో జిల్లా నల్గొండ. ఇక్కడ కూడా పన్నెండు సీట్లు ఉంటే అందులో పదకొండు సీట్లలో కాంగ్రెస్ గెలుపు దిశగా దూసుకుని పోయింది. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధులు అందరికీ భారీ మెజారిటీలు దక్కడం విశేషం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే అందులో పది సీట్లలో కాంగ్రెస్ విజయపథాన దూసుకుని పోతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు సీట్లు ఉంటే అందులో పది సీట్లలో కాంగ్రెస్ ఘన విజయం సాధించేందుకు రెడీ అవుతోంది.
ఇలా ఈ నాలుగు జిల్లాలలోనే మొత్తం 48 సీట్లు ఉంటే అందులో నూటికి తొంబై శాతం సీట్లు కాంగ్రెస్ పరం అయ్యేలా బలమైన గాలి వీచింది. దీంతో గులాబీ పెట్టుకున్న ఆశలు అన్నీ కూడా నేలకూలాయి అని అంటున్నారు. ఖమ్మంలో మొదటి నుంచి కాంగ్రెస్ కి పట్టు ఉంది. ఇక నల్గొండలో అలాగే పరిస్థితి ఉంది. కానీ మహబూబ్ నగరం, వరంగల్ లలో మాత్రం గులాబీ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు రావడం ఎవరికీ మింగుడుపడడం లేదు.
అదే సమయంలో కాంగ్రెస్ కి ఇంత వేవ్ ఉంటుందని అది బలంగా వీస్తుందని కూడా ఎవరూ ఊహించలేకపోయారు. సరిగ్గా నెల రోజున నుంచే కాంగ్రెస్ గాలి బలంగా వీచడం మొదలెట్టింది. అయినా సరే బీయారెస్ ధీమాగానే ఉంది. తాము చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పధకాలుకూడా జనాలకు చేరాయని అవే తమను గెలిపిస్తాయని భావించారు. కానీ రివర్స్ అయింది.
ఇక ఖమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారు బీయారెస్ నుంచి బయటకు వెళ్లడం దెబ్బగానే చూస్తున్నారు. ఏది ఏమైనా కూడా బీయారెస్ ని కోలుకోలేని విధంగా ఈ నాలుగు జిల్లాలు గట్టి దెబ్బ వేశాయని అంటున్నారు.