తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది...?
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. కాంగ్రెస్ కొద్ది నెలల క్రితం వరకూ చాలా దూరంగా ఉండిపోయింది
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. కాంగ్రెస్ కొద్ది నెలల క్రితం వరకూ చాలా దూరంగా ఉండిపోయింది. ఆ పార్టీలో కుమ్ములాటలు నేతల మధ్య అనైక్యత, మాటల తూటాలు ప్రతీ ఉప ఎన్నికలోనూ ఓటమి ఇలా అనేక రకాలుగా చూస్తే కాంగ్రెస్ వెనకబడిపోయింది. గ్రాఫ్ కూడా అంతగా లేదు అన్న మాట ఉంది.
ఈ నేపధ్యంలో కర్నాటక ఎన్నికలు జరిగాయి. నిజానికి కర్నాటక ఎన్నికలకూ తెలంగాణాకు పెద్దగా పోలిక లేదు, అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ ఓడింది బీజేపీ గెలిచింది కాంగ్రెస్. అంటే రెండు జాతీయ పార్టీల మధ్య పోరుతో కాంగ్రెస్ విన్ అయింది. కానీ తెలంగాణాలో అలా కాదు బలమైన ప్రాంతీయ పార్టీగా బీయారెస్ ఉంది.
ఆ పార్టీ జాతీయ స్వరూపం కోసం తన పేరుని మార్చుకుని ఇపుడిపుడే ఆ ప్రయత్నంలో ఉంది. ఇక హ్యాట్రిక్ సీఎం కావాలని కేసీయార్ కోరిక. బీయారెస్ కి పటిష్టమైన యంత్రాంగం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉంది. దూకుడు రాజకీయంతో పాటు పదునైన వ్యూహాలు ఆ పార్టీలు ఆయుధాలు.
అలాంటి బీయారెస్ మీద కనుక కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది అన్నది ఇపుడు చర్చకు వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో జాతీయ పార్టీలు గత పదేళ్లుగా నామమాత్రం అయ్యాయి. జాతీయ పార్టీలకు బదులుగా ప్రాంతీయ హవాయే కనిపిస్తోంది. ఏపీలో చూస్తే అయితే తెలుగుదేశం లేకపోతే వైసీపీ అన్నట్లుగా సీన్ ఉంది.
ఇక తెలంగాణాలో బీయారెస్ రెండు దఫాలుగా అధికారంలో ఉంటూ కాంగ్రెస్ కి నో చాన్స్ అంటోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలలో తమకు చోటు ఉందని గట్టిగా నిరూపించుకుంటోంది. ఆ ఊపుతో ఏపీ మీద కూడా తన ప్రభావం చూపించనుంది. ఇక దేశంలో జాతీయ పార్టీల హవా మళ్లీ బలంగానే సాగుతుంది.
ముఖ్యంగా సౌత్ లో చూస్తే అయిదు రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో కేరళలో జాతీయ పార్టీలదే అధికారం అన్నట్లుగా ఉంటుంది. అక్కడ ప్రాంతీయ పార్టీలు ఇంకా మొగ్గ తొడగలేదు. తమిళనాడు అయితే గడచిన ఆరు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే రాజ్యం. కర్నాటకలో ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. జాతీయ పార్టీలే అక్కడ ఉనికిని చాటుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలో తెలంగాణా కనుక కాంగ్రెస్ గెలిస్తే సౌత్ లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాలలో జాతీయ పార్టీలకు అవకాశాలు మెండు అని చెప్పగలుగుతుంది. ఇక సౌత్ లో అయిదింట నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ తాను గట్టిగా నిలబడితే రేపటి లోక్ సభ ఎన్నికల నాటికి అధికారానికి చేరువ అవుతుంది.
అదే టైంలో ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ పరిణామం ఇబ్బందిగా మారుతుంది. జాతీయ పార్టీలు చొచ్చుకుని పోతే కనుక అక్కడ మళ్లీ ప్రాంతీయ పార్టీలు మొలవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి ఎన్నో లెక్కలు ముడిపడి ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ గెలుపు అన్నది కేవలం తెలంగాణాకే పరిమితం కాదు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రలకే కాదు. ఇక సౌతిండియాలోనే కాంగ్రెస్ జెండా ఎగరడానికి యావత్తు భారత దేశంలో బీజేపీకి ఆల్టర్నేటివ్ గా రాణించడానికి కూడా వీలు అవుతుంది. మరి డిసెంబర్ 3న ఫలితాలు ఎలా ఉంటాయో ఏ రకమైన సంచలనాలు నమోదు చేస్తారో చూడాల్సి ఉంది.