అయిననూ పోయి రావలె హస్తినకు !

పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా 18 రోజుల గడువు మాత్రమే ఉన్నది. కానీ తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల నుండి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్న విషయం తేలడం లేదు.

Update: 2024-04-22 05:11 GMT

కాంగ్రెస్ అంటే అంతా అధిష్టానమే. మంత్రులయినా, ముఖ్యమంత్రులయినా ఢిల్లీ నుండి వచ్చే సీల్డ్ కవర్లే నిర్ణయిస్తాయి. నాయకులకు అవసరం ఉన్నా .. అధిష్టానానికి అవసరం ఉన్నా ఢిల్లీ బాట పట్టాల్సిందే. అక్కడ తీసుకునే నిర్ణయాలను శిరసా వహించాల్సిందే. తేడా వస్తే కుర్చీలు కదలడం ఖాయం.

పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా 18 రోజుల గడువు మాత్రమే ఉన్నది. కానీ తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాల నుండి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరన్న విషయం తేలడం లేదు. ముఖ్యంగా ఖమ్మం టికెట్ కాంగ్రెస్ నుండి తన భార్యకు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తన సోదరుడికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తన కుమారుడికి కావాలని మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు డిమాండ్ చేస్తున్నారు.

అధిష్టానం వీరందరినీ కాదని కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డిని తెరమీదకు తెచ్చారు. ఇతను మంత్రి పొంగులేటి వియ్యంకుడు కావడం పట్ల భట్టి, తుమ్మల దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి రేవంత్ నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావును తెరమీదకు తెచ్చాడు. దీనిని భట్టి, పొంగులేటి వ్యతిరేకించారు.

తన సోదరుడికి ఇచ్చినా, వియ్యంకుడికి ఇచ్చినా గెలిపించుకుంటానని పొంగులేటి చెబుతున్నారు. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని, చర్చించేందుకు అందరూ ఢిల్లీకి రావాలని ఏఐసీసీ చెప్పినట్లు సమాచారం. ఖమ్మం టికెట్ ఎవరికి దక్కుతుందో పక్కన పెడితే ఈ ఢిల్లీ ప్రదక్షిణలు ఏంటో అని కాంగ్రెస్ వర్గాలు గొణుక్కుంటున్నాయి.

Tags:    

Similar News