బాబు విషయంలో టీడీపీ క్లారిటీ మిస్ ...అందుకే అలా...?

ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు జాతి సంపద, ఆయన తెలుగు వారి ఆస్తి, మహోన్నత వ్యక్తి అని అంటున్నారు ఆయన తమ్ముడు కొడుకు నారా రోహిత్

Update: 2023-10-16 04:20 GMT

ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు జాతి సంపద, ఆయన తెలుగు వారి ఆస్తి, మహోన్నత వ్యక్తి అని అంటున్నారు ఆయన తమ్ముడు కొడుకు నారా రోహిత్. ఆయనకు టీడీపీ సానుభూతిపరుడు, పైగా రక్త సంబంధీకుడు ఇక సినీ ఫీల్డ్ లో ఉన్న వారు కూడా బాబు అరెస్ట్ ని ఖండించారు, వారిలో అత్యధికులు అంతా బాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం.

ఇంకో వైపు చూస్తే టీడీపీ ఎటూ బాబు అరెస్ట్ ని ఖండిస్తూనే ఉంది. ఇక బాబు గారు కుటుంబం బాధ అయితే వర్ణనాతీతం. అయితే ఇదంతా టీడీపీ బాధ, కుటుంబ బాధం సన్నిహితుల బాధగానే గడచిన నలభై రోజులుగా మిగిలిపోవడానికి కారణం ఏంటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

చంద్రబాబు నిజంగా మామూలు వ్యక్తి కాదు, ఆయన స్టేచర్ పెద్దదే. ఏపీకి ముమ్మారు సీఎం గా పనిచేసిన వారు మరో ముమ్మారు ప్రతిపక్ష నాయకుడు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర అనుభవం ఆయన సొంతం. ఇన్ని ఉన్నా చంద్రబాబు జైలులో ఉంటే టీడీపీ కి అనుకున్న సానుభూతి అయితే రావడం లేదు. అదే విధంగా టోటల్ అయిదు కోట్ల ప్రజలను ఈ అరెస్ట్ బాబు జైలు గోడల మధ్య నలిగిపోవడం కదిలించలేపోతోంది.

నో డౌట్ బాబు పేరుతో జరుగుతున్న నిరసనలు బాగానే ఉన్నాయి. అవి బాగానే సక్సెస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం మరచిపోకూడదు. టీడీపీ ఈనాడు పుట్టిన పార్టీ కాదు, ఫార్టీ ఇయర్స్ హిస్టరీ కలిగి ఉన్నది. 2019లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చినా నలభై శాతం ఓటు షేర్ వచ్చిన పార్టీ. అంతటి బలమైన పార్టీకి క్యాడర్ నిబద్ధతతో ఉన్న పార్టీకి నిరసనలు చేస్తే ఏపీ మొత్తం రీసౌండ్ చేయాలి. కానీ అలా జరుగుతోందా అంటే లేదు అనే చేదు జవాబు వస్తోంది.

బాబు అరెస్ట్ ని జనాలు తీసుకున్నారు కానీ పూర్తిగా వారు భావోద్వేగాలకు గురి కావడం లేదు. దాంతో నెల రోజుల తరువాత ఏకంగా బాబు ప్రాణాలకు ముప్పు ఉందని జైలు గోడల మధ్యన ఏదో జరిగిపోతోందని టీడీపీ నేతలూ అంటూ వచ్చారు. మొత్తానికి దాని మీద కోర్టు ఆదేశాలతో బాబుకు గదిలో ఏసీని ఏర్పాటు చేశారు. దాంతో బాబు అక్కడ చల్లబడ్డారు, ఇక్కడ టీడీపీ కూడా చల్లబడింది.

మరి బాబు జైలు లోపల ఉంటే బయట ఎలా వేడెక్కించాలి. ఎలా బాబు అరెస్ట్ మీద జనాల్లో చర్చకు పెట్టి హీటెక్కించాలి అన్నదే టీడీపీకి తెలియక తికమక పడుతోంది. అయితే ఇక్కడే టీడీపీ లాజిక్ మిస్ అవుతోంది అని అంటున్నారు. ఈ రోజున ఎవరూ న్యాయ నిపుణులు కారు కానీ సోషల్ మీడియా పుణ్యమాని న్యాయ ప్రక్రియ ఏమిటి ఎలా జరుగుతుంది అన్నది ప్రతీ ఒక్కరికీ అర్ధం అవుతోంది.

చంద్రబాబు జైలు గోడల మధ్య అన్ని రోజులు ఉన్నారు అంటే అది బెయిల్ కోసం కాదు క్వాష్ పిటిషన్ విషయంలో తీర్పు కోసం అన్నది సగటు జనాలకు అర్ధం అయింది అంటున్నారు. బాబు లాంటి వారు బెయిల్ పెట్టుకుంటే కచ్చితంగా ఒక రోజు కాకపోయినా మరో రోజు అయినా వచ్చి ఉండేది అన్నది సామాన్యుడికి కూడా తెలుస్తున్న వాస్తవం. మరి ఎందుకు అలా చేయడంలేదు. క్వాష్ పిటిషన్ పట్టుకుని అక్కడే ఎందుకు సాగదీస్తున్నారు అంటే దాని మీద వచ్చే సోషల్ మీడియా కధనాలు కూడా జనాలకు తెలుసు.

దాంతోనే అక్కడ బాబు జైలులో ఇన్నాళ్ళు ఉన్నారు అని అంటున్నా అనుకున్న స్థాయిలో జనం నుంచి రియాక్షన్ రావడం లేదు. మరో వైపు చూస్తే ఇది నాణేనికి రెండవ వైపు అన్న మాట. చంద్రబాబు రాజకీయ చాణక్యుడు. ఆయన జైలుకు వెళ్ళనే వెళ్లరు అన్నది జనాల ధీమా నమ్మకం. లేకపోతే ఆయన మీద ఉన్న విశ్వాసం. అలాంటి బాబు జైలుకు వెళ్లారు అంటే ఏదో జరిగి ఉంటుందని కూడా జనాలు అనుకునే పరిస్థితి కూడా ఉందని అంటున్నారు. అందుకే సోషల్ మీడియా ప్రభావంతో జనాలు వివిధ రకాలుగా చర్చించుకునే నేపధ్యం ఏర్పడుతోంది అంటున్నారు.

ఇక చంద్రబాబు జైలులో ఉన్నారన్న దాన్ని తమ బాధగానే టీడీపీ చెప్పుకుని వస్తోంది కానీ దాన్ని ప్రపంచ బాధగా చేసే విషయంలో మాత్రం ఫెయిల్ అవుతోంది. ఇక్కడ చేయాల్సిన తీరులో యాక్షన్ ప్లాన్ లేకపోవడం వల్ల కూడా మొదట్లో వచ్చిన వేడి చప్పబడిందని అంటున్నారు. వీకెండ్స్ లో సౌండ్స్ చే యడం లైట్లు ఆర్పడం, సంకెళ్ళు వేసుకోవడం వంటి కార్యక్రమాల వల్ల నిరసనలు చేశామన్న తృప్తి అయితే టీడీపీకి ఉందేమో కానీ జనాలకు ఎంత వరకూ కనెక్ట్ అవుతోంది అన్నది మాత్రం ఆలోచించాలనే అంటున్నారు. టోటల్ గా చూస్తే బాబు బాధ టీడీపీ బాధ మాత్రమే అవుతోంది అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News