3,50,000 మంది పిల్లలు.. 2,645 లీటర్ల పాలు.. టెక్సాస్ మహిళ వరల్డ్ రికార్డ్
ఓ టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా 3,50,000 మంది పిల్లలకు తన పాలు ఇచ్చి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.
ప్రస్తుత జనరేషన్‌లో ఒక తల్లి ఒక బిడ్డకు.. లేదంటే ఇద్దరు బిడ్డలు.. తప్పితే ముగ్గురు బిడ్డల వరకు పాలు ఇవ్వడం కామన్. మన నానమ్మ-తాతల కాలంలో ఆరేడు మందికి కూడా ఇచ్చారనుకోండి. కానీ.. ఓ టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా 3,50,000 మంది పిల్లలకు తన పాలు ఇచ్చి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది.
తల్లీబిడ్డల బంధం కూడా ఎన్నటికీ విడిపోనిది. ఎన్నటికీ మరువలేనిది. శిశువు పురుడుపోసుకొని బయటకు వచ్చినప్పటి నుంచే తల్లీబిడ్డల మధ్య ఆప్యాయతలు మొదలవుతాయి. అంతేకాదు.. పుట్టిన బిడ్డ మరింత స్ట్రాంగ్‌గా ఉండాలని వెంటనే ముర్రుపాలు పటిస్తుంటారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా వారిని ముర్రు పాలు కాపాడుతాయని డాక్టర్లు ఈ సూచనలు చేస్తుంటారు. అయితే.. కొన్నికొన్ని సందర్భాల్లో చాలా మంది పిల్లలకు ఆ అదృష్టం దక్కడం లేదు. చాలా మంది తల్లులకు పాలు రాక ఇబ్బందులు పడుతుంటారు. కానీ.. టెక్సాస్‌కు చెందిన ఈ మహిళ చేసిన త్యాగం మాటల్లో చెప్పలేనిది. వర్ణించలేనిది కూడా.
టెక్సాస్‌కు చెందిన అలీస్ ఓగ్లెట్రీ వయసు 36 ఏళ్లు. బలహీనంగా ఉన్న పిల్లల కోసం తన పాలను దానం చేయాలని ఆమె సంకల్పించింది. పాలు లభించక బిడ్డలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన ఆమె.. ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అలా 2010 నుంచే ఆమె ఈ దానం చేస్తోంది. నార్త్ టెక్సాస్‌లోని మదర్స్ మిల్క్ బ్యాంకుకు ఆమె తన పాలను దానంతో ఇస్తోంది. అలా ఇప్పటివరకు ఆమె 2,645 లీటర్లకు పైగా తల్లిపాలను విరాళంగా ఇచ్చింది. దీంతో ఆమె ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. దీంతో ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
2,645 లీటర్ల పాలు.. 3,50,000 మంది చిన్నారుల కోసం అలీస్ ఓగ్లెట్రీ తన పాలను విరాళంగా ఇచ్చింది. ఇక జూలై 2023 నాటికే 2,645.58 లీటర్లతో ఆమె రికార్డు క్రియేట్ చేసింది. 2014లో 1,569.79 లీటర్ల దానంపై ఉన్న రికార్డును ఆమె బ్రేక్ చేసింది. అయితే.. తాను డబ్బు సంపాదన కోసం ఇలా చేయలేదని అలీస్ వెల్లడించింది. ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. 2010లో తన మొదటి కుమారుడు కైకిల్ పుట్టినప్పటి నుంచే పాలు దానం చేయడం ప్రారంభించానని చెప్పింది. ఆ సమయంలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నర్సు ఉండి.. పాలు దానం చేస్తావా అడిగిందని.. అప్పటివరకు తనకు ఈ విషయం గురించి తెలియని పేర్కొంది. తనకు కూతురు పుట్టిన తరువాత కూడా పాలు దానం చేస్తున్నట్లు చెప్పింది. చాలా మంది పిల్లల ఆకలి తీరుస్తున్నందుకు తనకు ఎంతగానో ఆనందంగా ఉందని పేర్కొంది. ఈమె సరోగేట్ మదర్‌గానూ సేవలందించారు.