కాంగ్రెస్ ఎమ్మెల్యేను వేధిస్తున్న వాస్తు దోషం.. మంత్రి పదవి రాకపోవడానికి కారణం అదేనా.!?
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరుగాంచారు కోమటిరెడ్డి బ్రదర్స్. ప్రస్తుత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరుగాంచారు కోమటిరెడ్డి బ్రదర్స్. ప్రస్తుత రేవంత్ రెడ్డి క్యాబినెట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి కావాలి అన్నది చిరకాల వాంఛ. అయితే ఆయన కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు.
మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే.. మధ్యలో పార్టీ మారడం, అధిష్టానంపై అప్పుడప్పుడు నోరు జారడం వంటి వ్యవహారాలన్నీ ఆయనకు మైనస్ గా మారాయి. దీంతో ఇద్దరు సోదరులు ఒకరికి దక్కాల్సిన మంత్రి పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కింది. అయితే తనకి మంత్రి పదవి రాకపోవడానికి వాస్తు దోషం కారణం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తు సిద్ధాంతాన్ని సాధారణ ప్రజలతో పాటు సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఎంతగానో నమ్ముతారు. ఇదే కోవకు చెందుతారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
వాస్తు సిద్ధాంతాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతగానో విశ్వసిస్తారు. మంత్రి పదవి రాకపోవడానికి రాజకీయంగా అనేక కారణాలు ఉన్నప్పటికీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం వాస్తు దోషం కారణంగానే తనకు రాలేదు అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన క్యాంపు కార్యాలయం వాస్తు సరిగా లేదని భావించిన రాజగోపాల్ రెడ్డి దానిని కూలగొట్టి మళ్లీ కడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక సిద్ధాంత చెప్పిన మాట ప్రకారమే ఆయన తన క్యాంపు కార్యాలయాన్ని కూలగోడుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే తనకు మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి అడిగారు. అందులోనూ హోం మంత్రి ఇవ్వాలని అధిష్టానానికి తన కోరికను వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇద్దరు సోదరులు ఒకరికి మంత్రి పదవి ఇవ్వడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. దీంతో అనేక సందర్భాల్లో బహిరంగంగానే తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ ను ఆయన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన చిరకాల కోరిక నెరవేరకపోవడంతో వాస్తు దోషంపై ఆయన దృష్టి పడింది. తనకు సన్నిహితంగా మెలిగిన ఒక పండితుడి సూచనల మేరకు క్యాంపు కార్యాలయాన్ని కూలదోస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పులు ఆయనకి మంత్రి యోగాన్ని కల్పిస్తాయో లేదో చూడాల్సి ఉంది.