శిథిలాల కింద నుంచి ఆర్తనాధాలు... కలచివేస్తోన్న తాజా వీడియో!
ఈ సమయంలో 30 అంతస్తుల భవనాలతో పాటు 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది.;

మయన్మార్, థాయిలాండ్ లలో సంభవించిన భూకంపాలు భారీ నష్టాన్ని కలిగించినట్లు నివేదికలు తెరపైకి వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం... ఇప్పటివరకూ మయన్మార్ లో 55 మంది, థాయిలాండ్ లో నలుగురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో 30 అంతస్తుల భవనాలతో పాటు 1000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది.
అవును... తాజా భూకంపం అటు మయన్మార్ ను, ఇటు థాయిలాండ్ ను వణికించేశాయి. ఈ సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాల వివరాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే కూలిన భవనాల శిథిలాల కింద వందల మంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. భారీ భారీ నిర్మాణాలు పేక మేడల్లా కూలిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఈ సమయంలో... మయన్మార్ రాజధాని నేపిడాలోని 1000 పడకల ఆసుపత్రి తాజా భూవిలయం దాటికి కుప్పకూలింది. దీంతో... అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడ ఉండొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో.. ఇక్కడే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. ఈ సమయంలో తమ ఆత్మీయుల కోసం శిథిలాల వద్ద చాలా మంది గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇదే సమయంలో... మయన్మార్ లో దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, వంతెనలు కూలినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఈ భారీ భుకంపాల దాటికి ఆస్తి, ప్రాణ నష్టాలు భారీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకూ మృతుల సంఖ్య 55 అని చెబుతుండగా.. క్షతగాత్రుల సంఖ్య 200 గా కథనాలొస్తున్నాయి.
మరోపక్క భూకంపం కారణంగా బ్యాంకాక్ లో ఇప్పటివరకూ సుమారు నలుగురు చనిపోయినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో నగరంలో కుప్పకూలిన 30 అంతస్థుల భారీ భవనం కింద సుమారు 90 మంది గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. వీరిలో సహాయక చర్యల సిబ్బంది ఏడుగురుని రక్షించినట్లు తెలిపారు.
ఇలా మయన్మార్ తో పాటు థాయిలాండ్ లోనూ 12 నిమిషాల వ్యవధిలో వచ్చిన వరుస భారీ భూకంపాలు ఆ రెండు దేశాలనూ వణికించేశాయి. ఈ ఘటనలకు సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సమయంలో.. మృతుల సంఖ్యపై ఆందోళనలు రేగుతున్నాయని అంటున్నారు!