దళపతి విజయ్ పార్టీ జెండా ఇదే... ఫ్లాగ్ గీతం వైరల్!

తమిళసూపర్ స్టార్, దళపతి విజయ్ సినిమా రంగంలో చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-22 04:54 GMT

తమిళసూపర్ స్టార్, దళపతి విజయ్ సినిమా రంగంలో చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. తమిళనాట అతిపెద్ద మార్కెట్ ఉన్న హీరోల్లో విజయ్ ముందువరుసలో ఉంటారని చెబుతారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకీ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన పార్టీకి సంబంధించిన జెండాను ఆవిష్కరించారు.

అవును... దళపతి విజయ్ "తమిళగ వెట్రి కళగం" పేరుతో స్థాపించిన రాజకీయ పార్టీకి సంబంధించిన జెండాను తాజాగా ఆవిష్కరించారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. ఇదే సమయంలో... పార్టీ జెండా గీతాన్ని యూట్యూబ్ లో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతుంది. ఫ్యాన్స్ కామెంట్లతో విషెస్ చెబుతున్నారు.

ఇక తాజాగా విజయ్ విడుదల చేసిన పార్టీ జెండా పసుపు, ఎరుపు రంగులతో ఉండి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఈ జెండా మధ్యలో ఓ పువ్వు ఉంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. ఈ జెండా మధ్యలో కనిపించే పువ్వు పేరు వాగాయ్. చోళుపు, పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వాళ్లకి ఈ పూలతో చేసిన దండలే వేసేవాళ్లట. అలా ఈ పూలని విజయానికి ప్రతీకగా చూసేవాళ్లు.

ఇక ఈ జెండాపై తమిళ కవి తిరువళ్లువర్ రాసిన ఓ కొటేషన్ ఉంది. అది.. "ఫిరపొక్కుం ఏల్ల ఊయిర్క్కం" అని. అంటే... "పుట్టుకతో అందరూ సమానమే" అని దానర్ధం! తాజాగా పనయార్ లోని పార్టీ ఆఫీసులో ఈ జెండాను ఆవిష్కరించారు దళపతి. ఈ కార్యక్రమంలో ఆయన తల్లితండ్రులతో పాటు మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కాగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఆయన పద్దతు ఇవ్వలేదు. ఇక 2026లో జరగబోయే ఎన్నికలపైనే ఆయన పూర్తి ఫోకస్ అని చెబుతున్నారు!

Full View
Tags:    

Similar News