అంబటికి షాక్! దేవాన్ష్ సెక్యూరిటీపై ఏపీ పోలీస్ కామెంట్!

తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని జగన్ హై కోర్టును ఆశ్రయించారు.. తన భద్రతను కావాలనే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించినట్లు ఆరోపించారు.

Update: 2024-08-08 07:10 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెక్యూరిటీకి సంబంధించిన చర్చ గత కొన్ని రోజులుగా తీవ్రంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని జగన్ హై కోర్టును ఆశ్రయించారు.. తన భద్రతను కావాలనే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికార పక్షం నుంచి విమర్శలు, క్లారిటీలు వచ్చాయి.

జగన్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీని తగ్గించలేదని ఏపీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మరోపక్క పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం కి ఇచ్చిన సెక్యూరిటీ, పీఎం కి ఇచ్చిన భద్రత ఇవ్వాలని కోరడం ఏమిటి అని కూటమి నేతలు సెటైర్లు పేల్చారు. ఈ సమయంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఈ సందర్భంగా దేవాన్ష్ సెక్యూరిటీపైనా కామెంట్ చేశారు.

అవును... జగన్ కు భద్రత తగ్గించారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్పందించిన అంబటి రాంబాబు... జగన్ కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని తెలిపారు. 'జగన్ ఓడి పోయాడు కానీ.. చావలేదు' అని స్వయంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని, ఇలాంటి పరిస్థితుల్లోనే సెక్యూరిటీ కోసం కోర్టుకు వెళ్లామని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా జగన్ కు ఎక్కువ భద్రత ఉన్నట్లుగా గోబెల్స్ ప్రచారం చేశారని చెప్పిన అంబటి రాంబాబు... ప్రస్తుతం జగన్ కు డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారు మాత్రమే ఇచ్చారని అన్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

దీంతో... ఈ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. ఇందులో భాగంగా... దేవాన్ష్ సెక్యూరిటీ గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా సత్యదూరాలని, నిరాధారమైనవని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ యాక్ట్ - 2023 ప్రకారం ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులకూ సెక్యూరిటీ ఉంటుందని వెల్లడించింది.

ఈ మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబీకులు ఎస్.ఎస్.జీ. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఉపయోగించుకోవట్లేదని తెలిపిన ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. ఇదే క్రమంలో... నారా దేవాన్ష్ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీని ఉపయోగించుకోవడం లేదని స్పష్టం చేసింది.

Tags:    

Similar News