చంద్రబాబు కోసం అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు!!
ఈ క్రమంలో తాజాగా మరోసారి జగన్ పై పూలవర్షం.. బాబు – లోకేష్ లపై తిట్ల వర్షం కురిపించారు కేశినేని నాని!
టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నానీ... చంద్రబాబు, లోకేష్ లను వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నప్పుడే బాబు & కో పై నిప్పులు చెరుగుతూ.. "ఆఫ్ట్రాల్ లోకేష్" అని ఫైర్ అయిన కేశినేని నాని... నాటి మొదలు తన యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి జగన్ పై పూలవర్షం.. బాబు – లోకేష్ లపై తిట్ల వర్షం కురిపించారు కేశినేని నాని!
అవును... రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా సంక్షేమ ఫలాలను పేదలకు దూరం కాకుండా జాగ్రత్తపడిన వ్యక్తి జగన్ అని... ఇప్పటివరకూ సుమారు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన సీఎం జగన్ అని.. ఇది అత్యంత అరుదైన సంఘటన అని కేశినేని ప్రశంసించారు. ఇదే సమయంలో విజయవాడ నడిబొడ్డున నిర్మించబడిన "స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్" గురించి స్పందించిన నానీ... కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. "నేను దళితులు పాలించిన రాష్ట్రాన్ని చూశాను.. దళిత పార్టీలు పాలించిన రాష్ట్రాలను చూశాను.. కానీ, పేదల పాలిట ఆశాజ్యోతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయానికి ఒక నిలువెత్తు నిదర్శనం అయిన అంబేడ్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున, అంటే... రాష్ట్రం నడిబొడ్డున అంతపెద్ద ఎత్తున ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారంలో మెజారిటీ షేర్ ఉండాలనేది ఆయన కోరిక" అని నాని తెలిపారు.
అనంతరం చంద్రబాబు పై స్పందించిన నాని... పొద్దున్న లేస్తే అది చేశా ఇది చేశా అని చెప్పే చంద్రబాబు... 2014 - 19 సమయంలో అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడిందని చెప్పిన నాని... చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో తిరువూరులో తనపైకి, స్వామిదాస్ పైకి లోకేష్ గూండాలను పంపాడని సంచలన ఆరోపణలు చేశారు నాని. ఇక "చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి. అయితే... సీఎం జగన్ కు మాత్రం పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి" అని కేశినేని నాని స్పష్టం చేశారు. అనంతరం... తిరువూరులో స్వామి దాస్ ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలని ఈ సందర్భంగా నాని ప్రజలకు పిలుపునిచ్చారు.