బాలికలు లైంగిక కోరికలు అదుపులో ఉంచుకోవాలి.. హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్!
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలు రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం పరితపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
రెండు రోజుల కిందట పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ బాలిక గర్భం ధరించిన వ్యవహారంపై స్పందించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలు రెండు నిమిషాల లైంగిక ఆనందం కోసం పరితపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే.. ఆ సమయంలో కోరికలను అదుపులో ఉంచుకుంటే.. `ఇలాంటి`(గర్భం దాల్చడం) పరిస్థితి ఉత్పన్నం కాదని అన్నారు. పైగా బాలిక అంగీకారంతోనే యువకుడు సెక్స్ చేశాడు కాబట్టి కేసు కట్టలేరని వ్యాఖ్యానించారు. ఈ కేసులో దోషిగా ఉన్న యువకుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ..తీర్పు చెప్పారు. అయితే. ఈ తీర్పుపై కోల్‌కతా పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు తాజాగా హైకోర్టుపై మండి పడింది. బాలికలు తమ కోరికలను అదుపులో ఉంచుకోవాలని, రెండు నిమిషాలు లైంగిక ఆనందాన్ని వాయిదా వేసుకోవాలని అన్న న్యాయమూర్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి వ్యక్తిగత వ్యాఖ్యలుగా పేర్కొన్న న్యాయస్థానం.. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు.. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు బాలికల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడినివిడుదల చేయడానికి వీల్లేదని.. పేర్కొంటూ.. నోటీసులు జారీ చేసింది.