ట్రంప్ దెబ్బకు అమెరికన్లకు భారంగా టాయిలెట్ పేపర్

చర్యకు ప్రతి చర్య మామూలే. ఈ చిన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిస్ అవుతున్నారా? అన్న భావన కలుగక మానదు.;

Update: 2025-03-30 04:15 GMT
ట్రంప్ దెబ్బకు అమెరికన్లకు భారంగా టాయిలెట్ పేపర్

చర్యకు ప్రతి చర్య మామూలే. ఈ చిన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిస్ అవుతున్నారా? అన్న భావన కలుగక మానదు. అలా అని ట్రంప్ పూర్తిగా తప్పని చెప్పటం కూడా ఇక్కడ ఉద్దేశం కాదు. గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రపంచం ఒక కుగ్రామంగా మారటం.. ఒక దేశం మీద మరో దేశం ఆధారపడటం ఇప్పుడో అలవాటుగా మారింది. అయితే.. ఈ సందర్భంగా కొన్నిసార్లు మేలు జరుగుతాయి. ట్రంప్ వాదన ప్రకారం.. తమకు ఎగుమతులు చేసే వస్తువలకు సంబంధించి ఆయా దేశాలు భారీగా పన్ను వేస్తున్నాయి.. అందుకు ప్రతీకారంగా తాము సైతం పన్ను బాదుడు బాదుతామని చెబుతున్నారు.

అయితే.. దీని కారణంగా అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు కొత్త కష్టం ఎదురవుతోంది. అలా అని.. కష్టం వారికి మాత్రమే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. తాము దిగుమతులు చేసుకునే వాటిపై ఎక్కువ పన్నులు వేస్తే.. అంతిమంగా భారమయ్యేది అమెరికన్ ప్రజలకే. పేరుకు కొన్ని దేశాల మీద ప్రతీకార పన్నుగా ట్రంప్ చెబుతున్నప్పటికి.. ఏతావాతా అది కాస్తా తిరిగి అమెరికన్ ప్రజల జేబుల మీదనే భారం పడుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

మిగిలిన వస్తువుల సంగతిని పక్కన పెడితే.. అమెరికన్లు నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు.. బాత్రూంకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ ఎక్కువగా వినియోగించే వాటిల్లో టాయిలెట్ పేపర్ ముందు ఉంటుంది. ఇప్పటికి భారతీయులు టాయిలెట్ లో చేతిని.. నీటిని మాత్రమే వాడతారు.కానీ.. అమెరికన్లు మాత్రం టాయిలెట్ పేపర్ ను బండిళ్ల కొద్ది వినియోగిస్తారు. ఇంత భారీగా వినియోగించేఈ టాయిలెట్ పేపర్ ను సొంతంగా తయారుచేసుకునే సీన్ ఉందా? అంటే లేదనే చెప్పాలి.

అమెరికాకు దగ్గరగా ఉండే కెనడా మీద ఆధారపడుతుంది. ఏప్రిల్ 2 నుంచి కెనడాతో పాటు పలు దేశాల మీద ట్రంప్ వారీ ప్రతీకార సుంకాలు వడ్డించేందుకు సిద్ధం కావటం.. ఇప్పటివరకు కెనడా కలప మీద 14 శాతం సుంకాలు ఉంటే.. దాన్ని ఏకంగా 27 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా.. టాయిలెట్ పేపర్ ఉత్పత్తుల ధర యాభై శాతం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

టాయిలెట్ పేపర్లు.. పేపర్ టవళ్ల తయారీలో ఉపయోగించే ఎన్ బీఎస్ కలప గుజ్జు లభ్యత మీద ప్రభావం చూపనుంది. ట్రంప్ టారిఫ్ వడ్డన కారణంగా వీటి ధరలు భారీగా పెరగనున్నట్లు చెబుతున్నారు. అంతిమంగా ఇది అమెరికా ప్రజలకు ధరాభారం కానుంది. అమెరికన్లు ఉపయోగించే టాయిలెట్ పేపర్లలో ముప్ఫై శాతం.. పేపర్ టవళ్లలో సగం వాటా కెనడా కలప గుజ్జునే వినియోగిస్తారు. గత ఏడాది కెనడా నుంచి 20 లక్షల టన్ను (టన్ను అంటే వెయ్యి కేజీలు) ఎన్ బీఎస్ కే ను దిగుమతి చేసుకుంది. సుంకాలు పెంచితే సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే.. టాయిలెట్ పేపర్లకు కొరత ఏర్పడినా ఆశ్చర్యం లేదన్న మాట వినిపిస్తోంది. కాస్త ఆలోచనతో నిర్ణయాలు కాకుండా.. తాను నమ్మిందే నిజమన్నట్లుగా పాలకులు నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది మరి.

Tags:    

Similar News