పిఠాపురానికి రెండు ఎమ్మెల్సీలు...!

మాజీ ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు పిలిపించుకుని మరీ ఆయనకు గట్టి హామీ ఇచ్చారు.

Update: 2024-03-21 23:30 GMT

పిఠాపురం అసెంబ్లీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం కాదు కానీ తెలుగుదేశం వైసీపీ తమ నేతలకు ఎమ్మెల్సీ హామీలు ఇచ్చి మరీ ప్రచార పర్వంలోకి దించుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే వర్మను చంద్రబాబు పిలిపించుకుని మరీ ఆయనకు గట్టి హామీ ఇచ్చారు.

జనసేన అధినేత పవన్ ని పొత్తులో భాగంగా గెలిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. దానికి బదులుగా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.

దంతో వర్మ పిఠాపురం వచ్చి జనసేన అధినేత పవన్ గెలుపు కోసం కృషి చేస్తాను అని ప్రకటించారు.

వైసీపీ కూడా ఇలాంటి హామీయే తమ పార్టీ ఎమ్మెల్యేకు ఇచ్చింది. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబుని జగన్ స్వయంగా పిలిపించుకుని మరీ వైసీపీ గెలుపు బాధ్యతలు పెట్టారు పిఠాపురంలో వంగా గీత గెలుపునకు కృషి చేయాలని అన్నారు.

పిఠాపురంలో వంగా గీత వర్గం దొరబాబు వర్గం అన్నట్లుగా పనిచేస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు కొంత బలం ఉంది. దీంతో గీతకు టికెట్ ఇవ్వడంతో ఆయన కొన్నాళ్ళుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలలో పెద్దగా పాలొనగడంలేదు.

అయితే జగన్ ఆయనను పిలిచి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడంతో దొరబాబు యాక్టివ్ అయ్యారు. వర్గ పోరుని మరచి పనిచేస్తామని అన్నారు. పిఠాపురం సీటులో వైసీపీ జెండా ఎగరేసే బాధ్యత తీసుకుంటామని ఆయన అంటున్నారు.

మొత్తం మీద చూస్తే పిఠాపురంలో ఎమ్మెల్యే ఎవరు అయితే అదే పార్టీకి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు. దీంతో ఈసారి పిఠాపురానికి ఎమ్మెల్యేతో పాటు బోనస్ గా ఎమ్మెల్సీ రాబోతోంది. సో ఇపుడు పోటీ రంజుగా ఉండబోతోంది. వారూ వీరూ మోహరించి తమ సత్తా చాటనున్నారు. దాంతో మరి విజయం ఏ వైపున ఉంటుందో ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News