పడేవి.. పడుతున్నవి : వైసీపీలో వికెట్ల పాలిటిక్స్.. !
అయితే.. వీరిలో ఒకరిద్దరిని గమనిస్తే.. తాము రాజకీయ సన్యాసం తీసుకున్నామని.. ఇకపై రాజకీయాలు చేయబోమ ని కూడా చెప్పారు.
రాజకీయాల్లో పార్టీలు మారడం.. జంపింగులు చేయడం కొత్తకాదు. నాయకులకైనా , పార్టీలకైనా అవసరం- అవకాశం అనే రెండు పట్టాలే ప్రాతిపదికగా ముందుకు సాగుతారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి వెళ్లేవారు.. వెళ్తున్నవారు.. అనే అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పటికి చాలా మంది బయటకు వెళ్లారు. అయితే.. వీరిలో ఒకరిద్దరిని గమనిస్తే.. తాము రాజకీయ సన్యాసం తీసుకున్నామని.. ఇకపై రాజకీయాలు చేయబోమని కూడా చెప్పారు. కానీ, కట్ చేస్తే.. ఒకటి రెండు మాసాల్లోనే తమ దారులు తాము వెతుక్కున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఇది కూడా రాజకీయమే. ఇక, మరికొందరు.. వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు.. జగన్‌పై విమర్శలు చేసి.. బయటకు వచ్చిన వారు కూడా ఉన్నారు. రాజకీయ సన్యాసం చేస్తానన్న వారి జాబితాలో ఆళ్ల నాని ఉంటే.. విమర్శలు గుప్పించి బయటకు వచ్చిన ప్రముఖుల్లో అవంతి శ్రీనివాస్ ఒకరు. సో.. వీరి అంతిమ లక్ష్యం లైవ్‌లో ఉన్న పార్టీకి అండగా ఉండడంతోపాటు.. తమ పనులు పూర్తి కావడం. తద్వారా తమ వ్యాపారాలు, వ్యవహారాలు సజావుగా నడవాలి!
తాజాగా.. విశాఖపట్నానికి చెందిన దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయన కూడా దారి మార్చుతున్నారు. గత 2019లో దక్షిణం నుంచి విజయం దక్కించు కున్న వాసుపల్లి .. తర్వాత వైసీపీకి జై కొట్టారు. ఏకంగా కుమారుడితో సహా పార్టీ మారారు. అయితే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ ప్రయత్నాలే.. పైన చెప్పుకొన్నట్టుగా.. ఎదురు దాడి వ్యూహాన్ని అనుసరిస్తున్నా యి.
వైసీపీ నేతలపైనే ప్రస్తుతం గణేష్ కామెంట్లు చేశారు. అంతేకాదు.. కొందరు నాయకుల కారణంగానే పార్టీ ఓడిపోయిందని.. రుషికొండలో అంత డబ్బులు ఎందుకు ఖర్చు చేశారని ఆయన ప్రశ్నించడం ద్వారా వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు తనంతట తనే మార్గం వేసుకుంటున్నారన్నది విశాఖలో వినిపిస్తు న్న టాక్. కాగా.. మరోవైపు.. వాసుపల్లి కూటమిలోని తన మిత్రులతో టచ్‌లో ఉంటున్నట్టు తెలిసింది. పార్టీ మారేందుకు తాను సిద్ధమేనని వాసుపల్లి చెబుతున్నారు. కానీ, కూటమి నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.