జగన్ తమ్ముడికి బెయిల్.. వైసీపీకి అన్నీ మంచి శకునాలే..

అయినప్పటికీ కేసు యథావిధిగా కొనసాగుతుండటంతో విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు.;

Update: 2025-03-07 08:10 GMT

కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ తమ్ముడు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరైంది. కాకినాడ సీపోర్టు యజమాని కే.వెంకటేశ్వరరావు (కేవీఆర్)ను బెదిరించి ఆ కంపెనీ వాటాలను అరబిందోకు బదలాయించారని విక్రాంత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై కాకినాడ సీపోర్టు ఓనర్ కేవీఆర్ ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అరబిందో సంస్థ వాటాలను కేవీఆర్కి తిరిగి ఇచ్చేసింది. అయినప్పటికీ కేసు యథావిధిగా కొనసాగుతుండటంతో విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనను బెదిరించి భయపెట్టి కాకినాడ సీపోర్టు వాటాలు, కాకినాడ సెజ్ భూములను విక్రాంత్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డి తీసుకున్నారని గత ఏడాది డిసెంబర్ 2న కాకినాడ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,కేవీఆర్‌ గ్రూపునకు చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, అదేనెల 6న ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కేవీఆర్ ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసిన తర్వాత మనీ లాండరింగ్ అనుమానంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించింది. అయితే ఈ పరిణామాలతో జాతీయ స్థాయిలో సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుందనే ఆలోచన చేసిన అరబిందో యాజమాన్యం ఫిర్యాదుదారు కేవీరావుతో రాజీకి ప్రయత్నంచింది. సీపోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసింది. దీంతో కేసు కొలిక్కి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News