ట్రంప్ తో పోరాడే ప్రపంచ నాయకులకు ప్రజాదరణ
ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో రాజకీయ రంగంలో ఏర్పడుతున్న కొత్త ట్రెండ్! భవిష్యత్తులో మరికొందరు ప్రపంచ నాయకులు కూడా ఈ ట్రెండ్‌లో చేరతారా? అనేది ఆసక్తికరంగా మారింది.;
‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి.. పెట్టుకుంటే అగ్రరాజ్యపు అధిపతినే ఢీకొట్టాలి. ఇప్పుడు ఇదే ఫేడ్ అవుట్ అయిపోతున్న నేతలకు వరంగా మారింది. తమ రాజకీయ భవిష్యత్తుకు పునాధిగా తీర్చిదిద్దుతోంది. ట్రంప్ ఎవరినైనా టార్గెట్ చేస్తే, వారు ప్రజాదరణ పొందుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అతనికి వ్యతిరేకంగా నిలబడే నాయకులకు వారి దేశాల్లో భారీ మద్దతు లభిస్తోంది. ఇటీవల కెనడా, మెక్సికో, బ్రిటన్, ఉక్రెయిన్, తదితర దేశాల నాయకులు ఈ ప్రభావాన్ని అనుభవిస్తున్నారు.
1. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా కెనడా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని జస్టిన్ ట్రూడోను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటాడు. అయితే, ట్రంప్ తన వ్యాఖ్యలతో ట్రూడో పాపులారిటీని పెంచేశాడు. కెనడాలో లిబరల్ పార్టీ ఆదరణ 38% పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ మద్దతు 36 శాతానికి తగ్గిపోవడంతో, ట్రూడో మళ్లీ అధికారం దక్కించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ట్రంప్ రాకముందు ట్రూడో పార్టీ పాపులారిటీ కేవలం 20 శాతానికి పడిపోవడం గమనార్హం. దీంతో ట్రంప్ తో పెట్టుకునే ట్రూడో, ఆ పార్టీ ఈ పాపులారిటీ సాధించిందని అక్కడి సర్వేలు చెబుతున్నాయి.
2. మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా సెండన్
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా సెండన్ మద్దతు తగ్గుతుండగా, ట్రంప్ మెక్సికోపై ఇమ్మిగ్రేషన్, డ్రగ్ ట్రేడ్ విషయంలో తీవ్ర విమర్శలు చేశాడు. మెక్సికోపై టారిఫ్ లు విధించడంపై క్లాడియా గట్టిగా స్పందించడంతో, ఆమెకు దేశంలో భారీ మద్దతు లభించింది. ఆమె ప్రజాదరణ గణనీయంగా పెరిగింది.పెద్ద ఎత్తున మెక్సికన్ ప్రజలు ఆమెకు జైజైలు కొడుతున్నారు..
3. బ్రిటన్ లేబర్ పార్టీ నేత కీవ్ స్ట్రామర్
ట్రంప్ , ఎలోన్ మస్క్ బ్రిటన్ లేబర్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని కీవ్ స్ట్రామర్‌ను విమర్శించడంతో బ్రిటన్ ప్రజల్లో అతని ఆదరణ పెరిగింది. బ్రిటన్ నుంచి లేబర్ పార్టీని తరిమికొట్టాలని ట్రంప్, మస్క్ అనడం బ్రిటన్ ప్రజల్లో సానుభూతిని పెంచింది. ట్రంప్ బ్రిటన్ బలం ఏమిటని ప్రశ్నించగా స్ట్రామర్ ట్రంప్‌తో ఘర్షణకు వెళకుండా, నెమ్మదిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అనంతరం బ్రిటన్ వచ్చేసి ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో భేటి అయ్యాడు. బ్రిటన్ ప్రధాని వేసిన ఈ అడుగులు, ట్రంప్ కు ఎదురు వెళ్లడంతో ఫిబ్రవరిలో 26%గా ఉన్న స్ట్రామర్ పాపులారిటీ ఇప్పుడు 31%కి పెరిగింది.
4. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా జెలెన్ స్కీ ఆదరణ తగ్గినప్పటికీ ట్రంప్ అతన్ని విమర్శించడం ప్రారంభించాక, ఆయన మళ్లీ ప్రజాదరణ పొందాడు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ భూభాగం కోల్పోయి.. ప్రజలు చనిపోవడంతో జెలెన్ స్కీపై వ్యతిరేకత వచ్చింది. 20000 మంది ఉక్రెయిన్స్ యుద్ధం వద్దని మాట్లాడారు. అమెరికాలో ట్రంప్ జెలెన్ స్కీని అవమానించగా, జెలెన్ స్కీ ధీటుగా స్పందించి ప్రజల్లో మళ్లీ తన మద్దతును పెంచుకున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రజల్లో ఆయన పాపులారిటీ 44% పెరిగిందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
-ట్రంప్ ఎఫెక్ట్: గతంలో కూడా ఇదే ట్రెండ్
ఇదే విధంగా గతంలో జర్మనీ చాన్స్‌లర్ అంగెలా మెర్కెల్‌పై ట్రంప్ విమర్శలు చేయగా, ఆమె పాపులారిటీ పెరిగి పదేళ్లపాటు అధికారంలో కొనసాగగలిగింది. ఇది స్పష్టంగా చూపిస్తుంది. ట్రంప్ ఎవరినైనా టార్గెట్ చేస్తే, వారు ఆదేశ ప్రజల్లో మరింత ఆదరణ పొందుతారు.
- గతానికి భిన్నమైన రాజకీయ డైనమిక్స్
సాధారణంగా ప్రపంచ నాయకులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షులు ఇతర దేశాల నేతలను విమర్శించగా, అది రాజకీయంగా ప్రభావితం కాకుండా ఉండేది. కానీ ట్రంప్ ధోరణి వేరు. అతను ఎవరినైనా విమర్శిస్తే, వారు తమ దేశ ప్రజల్లో మరింత బలంగా నిలబడుతున్నారు.
ఇది డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో రాజకీయ రంగంలో ఏర్పడుతున్న కొత్త ట్రెండ్! భవిష్యత్తులో మరికొందరు ప్రపంచ నాయకులు కూడా ఈ ట్రెండ్‌లో చేరతారా? అనేది ఆసక్తికరంగా మారింది.