బాబుగోరు ఇలానే ఉంటే.. జ‌గ‌న్ ప్యాలెస్‌లో ప‌డుకోవ‌చ్చు.. !

కాబ‌ట్టి పెద్ద‌గా ప్ర‌భావం ఏమీ చూపించ‌క‌పోవ‌చ్చ‌ని కూట‌మి పార్టీల నాయ‌కులు కూడా లెక్కలు వేసుకోవ‌చ్చు.

Update: 2024-10-05 00:30 GMT

'మార్పు' మంచిదే అనుకున్న జ‌నాల‌కు.. చంద్ర‌బాబు కూట‌మి స‌ర్కారు నుంచి ఆశించిన విధంగా ఫ‌లితం ద‌క్క‌డం లేద‌న్న `టాక్` ప్రారంభ‌మైంది. ఇది ఇప్పుడు ప‌ది మంది నుంచే ప్రారంభ‌మై ఉండొ చ్చు. కాబ‌ట్టి పెద్ద‌గా ప్ర‌భావం ఏమీ చూపించ‌క‌పోవ‌చ్చ‌ని కూట‌మి పార్టీల నాయ‌కులు కూడా లెక్కలు వేసుకోవ‌చ్చు. కానీ, రాను రాను.. ఈ 'టాక్‌' పెరిగితే పెద్దగా క‌ష్ట ప‌డ‌కుండానే కూట‌మి స‌ర్కారు వ్య‌తిరేక త‌ను మూట‌క‌ట్టుకునే ప్ర‌మాదం పొంచి ఉంది. ఇదేస‌మ‌యంలో వైసీపీకి సానుభూతి కూడా ఏర్ప‌డ‌నుంది.

కీల‌కంగా రెండు విష‌యాలు ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. 1) వలంటీర్లు. 2) స‌చివాల‌యా లు. ఈ రెండు అంశాలు ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి. ప్ర‌జ‌ల‌కు ఏం కావాల‌న్నా.. గ‌తంలో వైసీపీ హ‌యాంలో చేతిలో వ‌లంటీర్ ఫోన్ నెంబ‌రు ఉండేది. దీంతో వెంట‌నే ఆ నెంబ‌రుకు కాల్ చేసేవారు. ఇంట్లో కరెంటు స‌మ‌స్య నుంచి వీధిలో కుళాయి వ‌రకు, వ్య‌క్తిగ‌త స‌ర్టిఫికెట్ల నుంచి ప్ర‌భుత్వ ప‌థ‌కాల వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లు వ‌లంటీర్ల‌పైనే ఆధార‌ప‌డ్డారు.

అంతేకాదు.. త‌మ స‌మ‌స్య‌లు సీరియ‌స్ అయితే..స‌చివాల‌యాల‌కు కూడా వెళ్లేవారు. అయితే.. ఇప్పుడు ఈ రెండు వ్య‌వ‌స్థ‌లు నాలుగు మాసాలుగా ప‌నిచేయ‌డం లేదు. నిజానికి తొలి రెండు మాసాలు వీటి అవ‌స రం కూడా పెద్ద‌గా జ‌నాల‌కు క‌నిపించ‌లేదు. కానీ, ప్ర‌స్తుతం కొత్త‌గా రేష‌న్ కార్డు కావాల‌ని కోరుకుంటున్న వారు, డెత్‌, బర్త్ స‌ర్టిఫికెట్లు, విద్యకు సంబంధించిన స‌ర్టిఫికెట్లు ఇలా ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. ఇప్పుడు క‌లె క్ట‌ర్ ఆఫీసులు ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయంగా మారాయి. వ‌లంటీర్లు లేరు, స‌చివాల‌యాలు తీసినా.. త‌మ‌కు ఏమీ ప‌ని అప్ప‌గించ‌లేద‌ని అడ్మిన్లు చెబుతున్నారు.

దీంతోఈ ఏడాది జూన్ వ‌ర‌కు కూడా ఇంటి ప‌ట్టునే ఉండి వ‌లంటీర్ ద్వారా అన్నీ అందుకున్న జ‌నాలు.. ఇప్పుడు త‌మ ప‌నులు మానుకుని.. ఎక్క‌డో ఉన్న క‌లెక్ట‌ర్ కార్యాల‌యం వ‌ర‌కు తిర‌గాల్సి వ‌స్తోంది. అక్క‌డ కూడా స‌రైన స‌మాధానం చెప్పేవారు క‌నిపించ‌డం లేదు. విజ‌య‌వాడ‌, విశాఖ స‌హా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఎవ‌రి నోట విన్నా ``వలంటీర్ ఎక్క‌డా? ఏమ‌య్యారు? ఏం చేస్తున్నారు`` అనే మాటే వినిపిస్తోం ది. మ‌రి ఈ విష‌యంపై చంద్ర‌బాబు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. పెను ప్ర‌మాదం చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News