జగన్ బాబు పవన్ : క్రోధీ నామ సంవత్సరంలో పవర్ పట్టేస్తారా ?
కూటమి కట్టేలా చూసి పొత్తులు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తన రాజకీయ జాతకం అద్భుతంగా ఉండాలని చూస్తున్నారు.;
శ్రీ క్రోధీ నామ సంవత్సరం ప్రవేశించింది. ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. మరో నెల రోజుల వ్యవధిలో ఏపీలో జనాలు తీర్పు ఇవ్వనున్నారు. రెండోసారి అధికారం కోసం వైసీపీ అధినేత జగన్ గట్టి కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా పోయిన అధికారాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చూస్తున్నారు. కూటమి కట్టేలా చూసి పొత్తులు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తన రాజకీయ జాతకం అద్భుతంగా ఉండాలని చూస్తున్నారు.
శ్రీ క్రోధీ నామ సంవత్సరంలో ఈ ముగ్గురు కీలక నేతల జాతకం ఎలా ఉంది అంటే పంచాంగకర్తలు పలు సంచలన విషయాలు వెల్లడిస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయం తీసుకుంటే ఆయన రెండవసారి అధికారంలోకి వస్తారా శ్రీ క్రోధీ నామ సంవత్సరం ఆయనకు సహకరిస్తుందా అంటే చాలా విషయాలు చెప్పుకోవాల్సి ఉంది అంటున్నారు.
జగన్ ది మిధున రాశి ఆరుద్ర నక్షత్రంగా ఉంది. ఆయనకు అందువల్లనే పట్టుదల చాలా ఎక్కువ అని అంటున్నారు. ఆయనకు రవి కుజులు గ్రహాల ప్రోత్సాహంతో రాజకీయ రంగంలో ఆయనకు మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే బాగా కష్టపడాల్సి ఉందని కూడా అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుది కృత్తిక నక్షత్రం. ఆయనకు చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు అని అంటున్నారు. ఆయనకు దశాంతర దశలు కలసి రాకనే గడచిన కాలంలో ఇబ్బందిలో పడ్డారని అంటున్నారు. బాబు రాశి వృషభ రాశి గా ఉంది. ఆయన రాజకీయ జీవితంలో చాలా గట్టిగానే పరి శ్రమించాల్సి ఉంటుందని అంటున్నారు పండితులు. 2024లో ఆయనకు అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో లేవు అని చెప్పాలని అంటున్నారు. చంద్రబాబు గ్రహబలం లో బుధుడు వీక్ గా ఉన్నారని అందుకే ఇతర పార్టీల మీద ఆధారపడే పరిస్థితి ఉంది అని అంటున్నారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాడ నక్షత్రం. మకరరాశి. ఆయనకు ఏలినాటి శని నడుస్తోంది. ఆయనకు ప్రస్తుతం ఒడిదుడుకులుగా రాజకీయం అంతా నడుస్తోంది అని అంటున్నారు. ఆయనకు మే తరువాత కొంత బాగుంటుంది అని అంటున్నారు. పంచమ స్థితిలో బృహస్పతి రావడం వలన ఆయన రాజకీయంగా కొంత పట్టు సాధిస్తారు అని అంటున్నారు. ఆయన ఈసారి తప్పకుండా అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
బృహస్పతి బలంతో పవన్ తొలిసారి ఎమ్మెల్యే అయి చట్ట సభలకు వెళ్తారు అని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా తనకంటూ ఒక ఉనికిని చాటుకుంటారని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ ముగ్గురు రాజకీయ నేతలకూ శ్రీ క్రోధీ నామ సంవత్సరం బాగా కష్టపడమనే చెబుతోంది అని పంచాంగ పండితులు చెబుతున్నారు. చూడాలి మరి ఈ జాతకాలు ఎంతమేరకు నెరవేరుతాయన్నది.