30 వేల మంది మిస్ అయిన మహిళలు ఎవరు...? పవన్ లోకేష్ కనుక్కుంటారా ?

ఆయన సడెన్ గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏపీ రాజకీయాలకే కాదు ఒక దశలో జాతీయ స్థాయి రాజకీయాలను కూడా కదిలించింది.

Update: 2024-10-21 17:30 GMT

ఏపీ నుంచి ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు అన్న వార్త ఒకప్పుడు ఎంతో సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు జనసేన అధినేత హోదాలో వారాహి సభలు చేస్తూ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నపుడు పవన్ కళ్యాణ్ చేసిన సంచలన కామెంట్స్ ఇవి.

ఆయన సడెన్ గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఏపీ రాజకీయాలకే కాదు ఒక దశలో జాతీయ స్థాయి రాజకీయాలను కూడా కదిలించింది. ముప్పై వేల మంది మహిళలు మిస్ కావడం అంటే మామూలు విషయం కానే కాదు, మరి దాని వెనక ఆధారాలు ఏమిటి అన్నది ఎవరూ కూడా ఆలోచించలేదు.

అప్పటికి అది అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఒక బ్రహ్మాస్త్రంగానే ప్రయోగించారు. ఇక వైసీపీ ప్రభుత్వం దానికి ధీటైన బదులిచ్చి ఎదుర్కోలేక పోయింది అన్నది వాస్తవం. ఇపుడు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు.

ఆయన ఆ పదవిలోకి వచ్చి నాలుగు నెలలు దాటింది. మరి వైసీపీ హయాంలో మిస్ అయిన ముప్పై వేల మంది మహిళల విషయం ఏమైనా తేల్చారా అంటే ఆ ఊసే లేదు అని అంటున్నారు. ఇదొక్కటే కాదు నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన విమర్శలు వేటి మీద కూడా ఇపుడు పట్టించుకోవడం లేదు అని కూడా అంటున్నారు.

అయితే మిగిలిన విమర్శలలో కొన్ని రాజకీయ విమర్శలు ఉంటే ఉండొచ్చు కానీ ముప్పై వేల మంది మహిళలు మిస్ అయినది మాత్రం సామాన్యమైనది కాదు, వైసీపీ ఎటూ తేల్చలేక పోయింది. మరి కూటమి అధికారంలోకి వచ్చాక తన బాధ్యతగా తేల్చాలి కదా అన్న చర్చ అయితే ఉంది.

ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవనే బాధ్యత తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ ప్రతీ సారి ఏపీలో మహిళలకు భద్రత లేదని, ఏకంగా ముప్పై వేల మంది మహిళలు మిస్ అయితే పట్టించుకునేవారు లేరని ఆరోపిస్తూ ఉండేవారు.

అయితే నాటి వైసీపీ ప్రభుత్వం దానికి కౌంటర్ గా మిస్ అయిన మహిళల లిస్ట్ ఇస్తే మేమే వారిని వెతికి తీసుకుని వస్తామని చెప్పేది. అయితే పవన్ మీద ప్రజలకు ఎంతో విశ్వాసం ఉంది కాబట్టి జనాలు నమ్మారు. వారు టీడీపీ కూటమిని ల్యాండ్ స్లైడ్ విక్టరీతో గెలిపించారు.

మరి చేతిలో అధికారం ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అలాగే నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈ ఇద్దరూ కలసి మిస్ అయిన ఆ ముప్పై వేల మంది మహిళలను వెతికి తీసుకుని రావాల్సిన బాధ్యతను కలిగి ఉన్నారు అని అంటున్నారు.

అంతే కాదు ఈ విధంగా మహిళల జీవితాలతో చెలగాటం ఆడేవారిని పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షించే పనిలో కూడా వారు ఉండాల్సి ఉందని అంటున్నారు. ఇదే విషయాన్ని మేధావులు కూడా అడుగుతున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడడం మిస్ అయిన ముప్పై వేల మందిని సురక్షింతంగా ఏపీకి తీసుకుని రావడం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల కీలకమైన బాధ్యత అని అంటున్నారు.

ఎన్నికల ముందు మహిళా రక్షణ గురించి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ని కూటమి పెద్దలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మరి అధికారంలోకి రాగానే వాటిని వరసగా అమలు చేసి తమది చేతల ప్రభుత్వం అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

లేకపోతే విపక్షంలో ఉన్నపుడు చేసిన విమర్శలలో పస లేదని కేవలం గాలి వాటం విమర్శలు అని ఒట్టి రాజకీయమే అని జనాలు అనుకునే ప్రమాదం ఉంది అని అంటున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలు పని ఒత్తిడిలో కొన్ని విషయాలను తాత్కాలికంగా మరచిపోవచ్చు. కానీ వారు అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ జనాలకు చెప్పినవి అన్నీ వారికి బాగా గుర్తు అని అంటున్నారు. \

అందులో ఎంతో విలువైనది అతి ముఖ్యమైనది అయిన ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ వ్యవహారం మాత్రం కూటమి పెద్దలకు అతి పెద్ద బాధ్యత అని అంటున్నారు. ఈ విషయంలో పవన్ లోకేష్ ఇద్దరూ సీరియస్ గానే రంగంలోకి దిగాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News